వాసితో నుండఁగా నీవే వచ్చేవుగాక
(॥పల్లవి॥)
వాసితో నుండఁగా నీవే వచ్చేవుగాక
ఆసతో సిగ్గువిడిచి అలయనేలా
(॥వాసి॥)
నిండు వావిసేసుకొని నీతో నాపె నవ్వఁగాను
అండనున్నవారు చూచి యాఁకారనేల
కొండలు వంటి చన్నులఁ గోరి యాపె నిన్నొత్తఁగా
బండు బండై యట్టె తప్పక చూడనేలా
(॥వాసి॥)
మచ్చికతో నీవూ నాపె మాఁటలాడుకొనఁగాను
విచ్చనవిడి నాలించి వినఁగనేలా
కచ్చుపెట్టి యప్పటిని కాఁగిలించుకుండఁగాను
కుచ్చితాన లోలోనే గుబ్బతిలనేలా
(॥వాసి॥)
ఆకె నీతములానకు నట్టె చే యొగ్గఁగాను
ఆకడి వారితో మిమ్ము నాడుకోనేలా
యీకడ శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
పైకొని నీ చేఁతలిఁకఁ బచారించనేలా
(||pallavi||)
vāsido nuṁḍam̐gā nīve vachchevugāga
āsado sigguviḍisi alayanelā
(||vāsi||)
niṁḍu vāvisesugŏni nīdo nābĕ navvam̐gānu
aṁḍanunnavāru sūsi yām̐kāranela
kŏṁḍalu vaṁṭi sannulam̐ gori yābĕ ninnŏttam̐gā
baṁḍu baṁḍai yaṭṭĕ tappaga sūḍanelā
(||vāsi||)
machchigado nīvū nābĕ mām̐ṭalāḍugŏnam̐gānu
vichchanaviḍi nāliṁchi vinam̐ganelā
kachchubĕṭṭi yappaḍini kām̐giliṁchuguṁḍam̐gānu
kuchchidāna lolone gubbadilanelā
(||vāsi||)
āgĕ nīdamulānagu naṭṭĕ se yŏggam̐gānu
āgaḍi vārido mimmu nāḍugonelā
yīgaḍa śhrīveṁkaḍeśha yiṁtalo nannelidivi
paigŏni nī sem̐talim̐kam̐ basāriṁchanelā