Vaasi vamtugum benamge vanidalamu

వాసి వంతుకుఁ బెనఁగే వనితలము
Language

(॥పల్లవి॥)
వాసి వంతుకుఁ బెనఁగే వనితలము
సేసవెట్టితివి ఇఁకఁ జెప్పనేల విభుఁడా

(॥వాసి॥)
చల్లనివెన్నెలనవ్వు చల్లితివి నేఁడు నీవు
మొల్లమిగా నంత నేము మోవఁగలమా
నల్లనిచూపులు నీపై నాటేము మారుకు మారు
తెల్లమి నీ గుట్టు మాకుఁ దెలియదు విభుఁడా

(॥వాసి॥)
మొగిఁదేనెవంటిఁమాట మోపేవు మామీఁద
మిగులా నిందుకు నిన్ను మెచ్చఁగలమా
యిగురుఁ గారపువీడె మిచ్చేము నేమైతే
తగునో తగదోకాని తలచుఁకో విభుఁడా

(॥వాసి॥)
వెడ వుంగరాలచేయి వేసేవు మామీఁద
ఆడరి నిన్నిఁక నౌఁగాదనఁ గలమా
విడువక నిన్ను నే శ్రీవేంకటేశ కూడితిని
బడిబడి నిఁక నిన్నుఁ బాయలేను విభుఁడా

(||pallavi||)
vāsi vaṁtugum̐ bĕnam̐ge vanidalamu
sesavĕṭṭidivi im̐kam̐ jĕppanela vibhum̐ḍā

(||vāsi||)
sallanivĕnnĕlanavvu sallidivi nem̐ḍu nīvu
mŏllamigā naṁta nemu movam̐galamā
nallanisūbulu nībai nāḍemu mārugu māru
tĕllami nī guṭṭu māgum̐ dĕliyadu vibhum̐ḍā

(||vāsi||)
mŏgim̐denĕvaṁṭim̐māḍa mobevu māmīm̐da
migulā niṁdugu ninnu mĕchcham̐galamā
yigurum̐ gārabuvīḍĕ michchemu nemaide
taguno tagadogāni talasum̐ko vibhum̐ḍā

(||vāsi||)
vĕḍa vuṁgarālaseyi vesevu māmīm̐da
āḍari ninnim̐ka naum̐gādanam̐ galamā
viḍuvaga ninnu ne śhrīveṁkaḍeśha kūḍidini
baḍibaḍi nim̐ka ninnum̐ bāyalenu vibhum̐ḍā