(॥పల్లవి॥)
వారిగో వీరిగో వాడల వాడల
కోరిక మీరఁగ గోపాలులు
(॥వారి॥)
జోరునఁ గారీని చొక్కపువుట్లు
పేరని పాలును పెరుగును
వారలు వట్టేవు వాకిటివుట్ల
కూరిమిఁ గృష్ణుఁడు గోపాలులు
(॥వారి॥)
తొట తొట రాలీ దొండ్లయి వుట్ల
చిటిబెల్లాలును చిమ్మిరును
తటుకునఁ బట్టి దాపేరు పుక్కిళ్ల
గుటుకలు మింగి గోపాలులు
(॥వారి॥)
వానలు గురిసీ వరుస వుట్ల
తేనెలుం బండ్లు తెంకాయలు
ఆనేరు శ్రీ వేంకటాధిపతిఁ గూడి
గోనల గొందుల గోపాలులు
(||pallavi||)
vārigo vīrigo vāḍala vāḍala
koriga mīram̐ga gobālulu
(||vāri||)
jorunam̐ gārīni sŏkkabuvuṭlu
perani pālunu pĕrugunu
vāralu vaṭṭevu vāgiḍivuṭla
kūrimim̐ gṛṣhṇum̐ḍu gobālulu
(||vāri||)
tŏḍa tŏḍa rālī dŏṁḍlayi vuṭla
siḍibĕllālunu simmirunu
taḍugunam̐ baṭṭi dāberu pukkiḽla
guḍugalu miṁgi gobālulu
(||vāri||)
vānalu gurisī varusa vuṭla
tenĕluṁ baṁḍlu tĕṁkāyalu
āneru śhrī veṁkaḍādhibadim̐ gūḍi
gonala gŏṁdula gobālulu