Vaamdivo taam gosaramgaa vaddanenade

వాఁడివో తాఁ గొసరఁగా వద్దనేనటే
Language

(॥పల్లవి॥)
వాఁడివో తాఁ గొసరఁగా వద్దనేనటే
నేఁడు నా ముందర వచ్చి నిలుచున్న దిపుడు

(॥వాడి॥)
పలుకులేఁటికే నాతో జంతగత్తైతేఁ బతిని
వలపించుకొనఁగాను వద్దనేనటే
యెలమి నాతఁడు విడెమియ్యఁగాఁ జూడఁజాలక
వెలి నుండి తానేల వేసాలు సేసీనే

(॥వాడి॥)
పెద్దరికా లింతయేలే ప్రియముచెప్పి యతని
వద్దికి రప్పించుకోఁగా వద్దనేనటే
అద్దు కాతఁడు నాచన్ను లంటఁగా యేపురేఁగి
గద్దించి చూడఁగా నందుఁ గలిగేదేందే

(॥వాడి॥)
వేడుకైతే నౌఁగాకేమి విచ్చనవిడి నితని
వాడికై కలయఁగాను వద్దనేనటే
యీడనే శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
కూడె నన్ను నిఁకఁ దాను గొసరేదేఁటిదే

(||pallavi||)
vām̐ḍivo tām̐ gŏsaram̐gā vaddanenaḍe
nem̐ḍu nā muṁdara vachchi nilusunna dibuḍu

(||vāḍi||)
palugulem̐ṭige nādo jaṁtagattaidem̐ badini
valabiṁchugŏnam̐gānu vaddanenaḍe
yĕlami nādam̐ḍu viḍĕmiyyam̐gām̐ jūḍam̐jālaga
vĕli nuṁḍi tānela vesālu sesīne

(||vāḍi||)
pĕddarigā liṁtayele priyamusĕppi yadani
vaddigi rappiṁchugom̐gā vaddanenaḍe
addu kādam̐ḍu nāsannu laṁṭam̐gā yeburem̐gi
gaddiṁchi sūḍam̐gā naṁdum̐ galigedeṁde

(||vāḍi||)
veḍugaide naum̐gāgemi vichchanaviḍi nidani
vāḍigai kalayam̐gānu vaddanenaḍe
yīḍane śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
kūḍĕ nannu nim̐kam̐ dānu gŏsaredem̐ṭide