Vaagida numdi yemta vaadigalu sesevu

వాకిట నుండి యెంత వాడికలు సేసేవు
Language

(॥పల్లవి॥)
వాకిట నుండి యెంత వాడికలు సేసేవు
లోకమెల్లా నెరుఁగును లోనికి రావయ్యా

(॥వాకి॥)
పడఁతి వినయముల బయలు వందిలి వెట్టె
తడఁబాటు సిగ్గులను దడి గట్టెను
వుడివోని తమకము నొడినిండా నీకు నించె
యెడమాట లిఁకనేల ఇంటికి రావయ్యా

(॥వాకి॥)
కలికి కనుచూపులకానెకలు నీకు నిచ్చె
సులభాన వలపుల సూడిదె లంపె
సెలవుల నవ్వులనే చిత్తమెల్లాఁ గరఁగించె
వెలినుండి జంపులేల విడిదికి రావయ్యా

(॥వాకి॥)
భామ తమ్మి మొగ్గలనుపాన్పు నీకుఁ బరచె
వేమరు మోవితేనెల విందులు వెట్టె
ఆముక శ్రీవేంకటేశ యట్టె యీకెఁ గూడితివి
దామెటసన్న లవేల తావుకు రావయ్యా

(||pallavi||)
vāgiḍa nuṁḍi yĕṁta vāḍigalu sesevu
logamĕllā nĕrum̐gunu lonigi rāvayyā

(||vāgi||)
paḍam̐ti vinayamula bayalu vaṁdili vĕṭṭĕ
taḍam̐bāḍu siggulanu daḍi gaṭṭĕnu
vuḍivoni tamagamu nŏḍiniṁḍā nīgu niṁchĕ
yĕḍamāḍa lim̐kanela iṁṭigi rāvayyā

(||vāgi||)
kaligi kanusūbulagānĕgalu nīgu nichchĕ
sulabhāna valabula sūḍidĕ laṁpĕ
sĕlavula navvulane sittamĕllām̐ garam̐giṁchĕ
vĕlinuṁḍi jaṁpulela viḍidigi rāvayyā

(||vāgi||)
bhāma tammi mŏggalanubānpu nīgum̐ barasĕ
vemaru movidenĕla viṁdulu vĕṭṭĕ
āmuga śhrīveṁkaḍeśha yaṭṭĕ yīgĕm̐ gūḍidivi
dāmĕḍasanna lavela tāvugu rāvayyā