Vaagida numde yemi yadigevu valavani suddulu

వాకిట నుండే యేమి యడిగేవు వలవని సుద్దులు
Language

(॥పల్లవి॥)
వాకిట నుండే యేమి యడిగేవు వలవని సుద్దులు
యేకతమాయను యింటిలోనికి యేలుదువు రావయ్యా

(॥వాకి॥)
మగువవూసిన కుంకుమ దుమ్ములో మలసి సాములుసేసినఁగాక
పగటుతో చనుసంగడాలెత్తుచు బలిమి చూపినఁగాక
తగిలి జంకెనబొమ్మలవిండ్లఁ దాఁగఁగఁగురులు యేసినఁగాక
నిగిడి యాపెనేరుపు లూరక నీకు నింతలోఁ దెలుసునా

(॥వాకి॥)
సుదతి జవ్వనగరిడికి నెక్కి సొరిది దాళాలు దొక్కినఁగాక
పెదవిమీఁదట గంటిదాఁకుదాఁకఁ బెనఁగినఁగాక
గుదికొన నీకెసింగారపుమేనిగోఁత మురమునమోచినఁగాక
వుదుటున నీపె జాణతనములు వూరకె నీకుఁదెలుసునా

(॥వాకి॥)
ఇందుముఖి నిట్టె లాలించే మొక్కుల నెక్కు డుదండాలు దోసినఁగాక
పొందిపొంది జగజెట్టిరతులనుఁ బొరలినఁగాక
కందువ శ్రీవేంకటేశ మీరిద్దరు కాఁగిట నిట్టె గెలిచినఁగాక
చెందిన యాకె సేవలలోపలిచేఁత లూరకె తెలుసునా

(||pallavi||)
vāgiḍa nuṁḍe yemi yaḍigevu valavani suddulu
yegadamāyanu yiṁṭilonigi yeluduvu rāvayyā

(||vāgi||)
maguvavūsina kuṁkuma dummulo malasi sāmulusesinam̐gāga
pagaḍudo sanusaṁgaḍālĕttusu balimi sūbinam̐gāga
tagili jaṁkĕnabŏmmalaviṁḍlam̐ dām̐gam̐gam̐gurulu yesinam̐gāga
nigiḍi yābĕnerubu lūraga nīgu niṁtalom̐ dĕlusunā

(||vāgi||)
sudadi javvanagariḍigi nĕkki sŏridi dāḽālu dŏkkinam̐gāga
pĕdavimīm̐daḍa gaṁṭidām̐kudām̐kam̐ bĕnam̐ginam̐gāga
gudigŏna nīgĕsiṁgārabumenigom̐ta muramunamosinam̐gāga
vuduḍuna nībĕ jāṇadanamulu vūragĕ nīgum̐dĕlusunā

(||vāgi||)
iṁdumukhi niṭṭĕ lāliṁche mŏkkula nĕkku ḍudaṁḍālu dosinam̐gāga
pŏṁdibŏṁdi jagajĕṭṭiradulanum̐ bŏralinam̐gāga
kaṁduva śhrīveṁkaḍeśha mīriddaru kām̐giḍa niṭṭĕ gĕlisinam̐gāga
sĕṁdina yāgĕ sevalalobalisem̐ta lūragĕ tĕlusunā