Uvidagu neegu netti vodambaadulo

ఉవిదకు నీకు నెట్టి వొడఁబాటులో
Language

(॥పల్లవి॥)
ఉవిదకు నీకు నెట్టి వొడఁబాటులో
జవళి రతుల నీతో సాము సేసీని

(॥ఉవి॥)
నలుగడలను నీవు నవ్వఁగాను
జలజాక్షి సిగ్గునను జంకించీని
బలిమిఁ గొంగు సెలసి పట్టఁగాను
నిలుచుంచి లోలోనే నివ్వేరగందీని

(॥ఉవి॥)
అట్టె నీవు సరసము లాడఁగాను
వొట్టువెట్టి నిన్ను గొర నొరసీని
చట్టంటుఁజేఁతల నీవు చెనకఁగాను
గుట్టుతోనే వలపులు గుబ్బతిలీని

(॥ఉవి॥)
చన్నులపై నీవు చేయీచాఁచఁగాను
సన్నలనే తనమోవిని చవిచూపీని
యిన్నిటా శ్రీవేంకటేశ యేలుకొంటివి
మన్నించఁగా నీతోఁ దాను మాఁటలాడీని

(||pallavi||)
uvidagu nīgu nĕṭṭi vŏḍam̐bāḍulo
javaḽi radula nīdo sāmu sesīni

(||uvi||)
nalugaḍalanu nīvu navvam̐gānu
jalajākṣhi siggunanu jaṁkiṁchīni
balimim̐ gŏṁgu sĕlasi paṭṭam̐gānu
nilusuṁchi lolone nivveragaṁdīni

(||uvi||)
aṭṭĕ nīvu sarasamu lāḍam̐gānu
vŏṭṭuvĕṭṭi ninnu gŏra nŏrasīni
saṭṭaṁṭum̐jem̐tala nīvu sĕnagam̐gānu
guṭṭudone valabulu gubbadilīni

(||uvi||)
sannulabai nīvu seyīsām̐sam̐gānu
sannalane tanamovini savisūbīni
yinniḍā śhrīveṁkaḍeśha yelugŏṁṭivi
manniṁcham̐gā nīdom̐ dānu mām̐ṭalāḍīni