Uttaraana levamdi dhrvanakshatram

ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
Year
Language

పల్లవి:

ఆ అహహాహా...
ఆ.....

ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా
చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా

ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం

చరణం 1:

చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ...
పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ...
జాణవున్న తావునే జాజిమల్లి తావులు
ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ
వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా...

ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం

చరణం 2:

ఈ నిశీధి వీధిలో బాటసారినై...
ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై...
నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో
నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో
వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా..
తెలుపరాదటే ఓ ప్రియభామా...

ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం
దక్షిణాన లేవంది మలయపర్వతం
నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా
చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా

pallavi:

ā ahahāhā...
ā.....

uttarāna levaṁdi dhṛvanakṣhatraṁ
dakṣhiṇāna levaṁdi malayabarvadaṁ
niṁgileni tāragā .. nīvĕkkaḍā .. nī vĕkkaḍā
sĕppave nī sirunāmā .. sĕppave nī sirunāmā

uttarāna levaṁdi dhṛvanakṣhatraṁ
dakṣhiṇāna levaṁdi malayabarvadaṁ

saraṇaṁ 1:

sukkabābanaḍigānu vĕnnĕlamma edanī...
pillagālinaḍigānu pūlagŏmma edanī...
jāṇavunna tāvune jājimalli tāvulu
prāṇamunna soḍuge parugulĕttu āśhalū
vĕdigāyī nī sirunāmā.. vĕdigāyī nī sirunāmā..
tĕlubarādaḍe o priyabhāmā...

uttarāna levaṁdi dhṛvanakṣhatraṁ
dakṣhiṇāna levaṁdi malayabarvadaṁ

saraṇaṁ 2:

ī niśhīdhi vīdhilo bāḍasārinai...
ī viśhāla jagadilo brahmasārinai...
nī darśhana bhāgyame korugunna kanulado
nī sannidhi kosame bradugudunna kalalado
vĕdigānū nī sirunāmā.. vĕdigānū nī sirunāmā..
tĕlubarādaḍe o priyabhāmā...

uttarāna levaṁdi dhṛvanakṣhatraṁ
dakṣhiṇāna levaṁdi malayabarvadaṁ
niṁgileni tāragā .. nīvĕkkaḍā .. nī vĕkkaḍā
sĕppave nī sirunāmā .. sĕppave nī sirunāmā