Uppusim dunumadaaya vumdamgaane nee badugu

ఉప్పుచిం దునుమడాయ వుండఁగానే నీ బదుకు
Language

(॥పల్లవి॥)
ఉప్పుచిం దునుమడాయ వుండఁగానే నీ బదుకు
లప్పల కస్తూరి పూఁత లాబమాయనయ్య

(॥ఉప్పు॥)
నే నీకు మేలుదాన నీవాపె మేలువాఁడవు
సానల నిద్దరిమేలు సరికి బేసి
నానెను చెమట నిట నడుమ నీమేనెల్ల
పానిపట్టి నీవలపు పండవండీనయ్యా

(॥ఉప్పు॥)
నవ్వితి నిన్నుజూ చాపెనవ్వులకు నీవు లోను
జవ్వన పిద్దరిమేలు సరికి బేసి
పువ్వుల పూజలాయ నీ భోగము మా జంటలను
పవ్వళించి నీకోరికె పలమందెనయ్యా

(॥ఉప్పు॥)
కూడితి నే నిన్ను నాపె కూటములు నీకు నచ్చె
జాడల మా కూటములు సరికి బేసి
యీడనె శ్రీ వేంకటేశ ఇయ్యకొంటి వీరెంటికి
పాడితో మోవులే నీకు పల్లదొరలయ్యా

(||pallavi||)
uppusiṁ dunumaḍāya vuṁḍam̐gāne nī badugu
lappala kastūri pūm̐ta lābamāyanayya

(||uppu||)
ne nīgu meludāna nīvābĕ meluvām̐ḍavu
sānala niddarimelu sarigi besi
nānĕnu sĕmaḍa niḍa naḍuma nīmenĕlla
pānibaṭṭi nīvalabu paṁḍavaṁḍīnayyā

(||uppu||)
navvidi ninnujū sābĕnavvulagu nīvu lonu
javvana piddarimelu sarigi besi
puvvula pūjalāya nī bhogamu mā jaṁṭalanu
pavvaḽiṁchi nīgorigĕ palamaṁdĕnayyā

(||uppu||)
kūḍidi ne ninnu nābĕ kūḍamulu nīgu nachchĕ
jāḍala mā kūḍamulu sarigi besi
yīḍanĕ śhrī veṁkaḍeśha iyyagŏṁṭi vīrĕṁṭigi
pāḍido movule nīgu palladŏralayyā