పల్లవి:
ఉన్నదిలే... దాగున్నదిలే...
నీకన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే
ఉన్నదిలే... దాగున్నదిలే
నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే
చరణం 1:
కన్నెపూల వన్నెలేవో...కన్ను గీటుతున్నవీ
కన్నెపూల వన్నెలేవో ...కన్ను గీటు తున్నవి
మేనిలోన ఊహలేవో...వీణ మీటుచున్నవి...
వీణ మీటుచున్నవి
ఉన్నదిలే ...దాగున్నదిలే...
నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే
చరణం 2:
గుండెలోన కోరికలేవో...దండలల్లుకున్నవీ...ఈ...ఈ..
గుండెలోన కోరికలేవో...దండలల్లుకున్నవి...
అందరాని పోంగులేవో..తొందరించుచున్నవి
..తొందరించుచున్నవి
ఉన్నదిలే... దాగున్నదిలే...
నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే
చరణం 3:
ఇన్నినాళ్ళ పుణ్యమంతా ...ఎదుటనిలిచి ఉన్నది
ఇన్నినాళ్ళ పుణ్యమంతా ...ఎదుటనిలిచి ఉన్నది
యుగయుగాల ప్రేమగాధ...చిగురువేయుచున్నది...
చిగురువేయుచున్నది...
ఉన్నదిలే... దాగున్నదిలే...
నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే...