Unnadaana nenoo vogareedi nibudu

ఉన్నదాన నేనూ వొకరీతి నిపుడు
Language

(॥పల్లవి॥)
ఉన్నదాన నేనూ వొకరీతి నిపుడు
తన్నుఁ దానే అయ్యీఁగాని తమకించకురే

(॥ఉన్న॥)
చనవులేని దాని చల మేఁటిచలమే
పెనఁగఁబోతేఁ గడుఁ బిరితీసును
నను నేల పొగడేవే నావిభుని ముందరను
వెనక నన్నీఁ జెప్పే వేగిరించకురే

(॥ఉన్న॥)
సరసమాడనిదాని సలి గేఁటి సలిగే
వొరయఁ బోతే నది వొల్లఁ బెట్టవును
సరవులేలడిగేరే సారె సారె నన్నిపుడు
తెరదీసే నిటమీఁద తీదీపులు మానరే

(॥ఉన్న॥)
చెల్లుబడిలేని దాని చెలి మేఁటిచెలిమే
మల్లాడఁబోతేను మట్టు మీరును
యిల్లిదె శ్రీ వేంకటేశు నిట్టె కూడించితివి
వెల్లవిరు లిఁకఁ జేసే వేడుకతో నుండరే

(||pallavi||)
unnadāna nenū vŏgarīdi nibuḍu
tannum̐ dāne ayyīm̐gāni tamagiṁchagure

(||unna||)
sanavuleni dāni sala mem̐ṭisalame
pĕnam̐gam̐bodem̐ gaḍum̐ biridīsunu
nanu nela pŏgaḍeve nāvibhuni muṁdaranu
vĕnaga nannīm̐ jĕppe vegiriṁchagure

(||unna||)
sarasamāḍanidāni sali gem̐ṭi salige
vŏrayam̐ bode nadi vŏllam̐ bĕṭṭavunu
saravulelaḍigere sārĕ sārĕ nannibuḍu
tĕradīse niḍamīm̐da tīdībulu mānare

(||unna||)
sĕllubaḍileni dāni sĕli mem̐ṭisĕlime
mallāḍam̐bodenu maṭṭu mīrunu
yillidĕ śhrī veṁkaḍeśhu niṭṭĕ kūḍiṁchidivi
vĕllaviru lim̐kam̐ jese veḍugado nuṁḍare