ఉన్న సుద్దు లేమిచెప్పీ నుద్దవుఁ డేటికి వచ్చె
(॥పల్లవి॥)
ఉన్న సుద్దు లేమిచెప్పీ నుద్దవుఁ డేటికి వచ్చె
మిన్నక వలచిన మా మేలు దలఁచీనా
(॥ఉన్న॥)
తల్లితోఁ బుట్టినవానిఁ దగ నేమో సేయువాఁడు
గొల్లెతలమీఁద దయ కోరి సేసీనా
మల్లాడి మేనమఱఁదిమాట కలిగినవాఁడు
చల్లువాని సరసాలు చవులయ్యీనా
(॥ఉన్న॥)
ఆలితోఁబుట్టినవాని నందముసేసినవాఁడు
జోలి గోక వాని కేఁటిచుట్టరికమే
లేలే కొడుకువియ్యాల లెస్స తగవు నడపె
నాలిదాక వానితోడినవ్వు లేఁటినవ్వులే
(॥ఉన్న॥)
మేనత్తకొడుకులను మిక్కిలి రక్షించినాఁడు
వూని తనసుద్దుకెల్లా నూఁకొనరే
కానీలే శ్రీవేంకటేశుఁ గమ్మరఁ గూడితి మిదే
తానేమనీనో ఇంక దగ్గరి యడుగరే
(||pallavi||)
unna suddu lemisĕppī nuddavum̐ ḍeḍigi vachchĕ
minnaga valasina mā melu dalam̐sīnā
(||unna||)
tallidom̐ buṭṭinavānim̐ daga nemo seyuvām̐ḍu
gŏllĕdalamīm̐da daya kori sesīnā
mallāḍi menamaṟam̐dimāḍa kaliginavām̐ḍu
salluvāni sarasālu savulayyīnā
(||unna||)
ālidom̐buṭṭinavāni naṁdamusesinavām̐ḍu
joli goga vāni kem̐ṭisuṭṭarigame
lele kŏḍuguviyyāla lĕssa tagavu naḍabĕ
nālidāga vānidoḍinavvu lem̐ṭinavvule
(||unna||)
menattagŏḍugulanu mikkili rakṣhiṁchinām̐ḍu
vūni tanasuddugĕllā nūm̐kŏnare
kānīle śhrīveṁkaḍeśhum̐ gammaram̐ gūḍidi mide
tānemanīno iṁka daggari yaḍugare