Udayagirana rekhalo... hrdaya veena teegalo...

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో...
Year
Language

పల్లవి:

ఉదయకిరణ రేఖలో
హృదయ వీణ తీగలో
పాడినదీ ఒక రాధిక
పలికినదీ రాగ మాలిక
ఇదే ఇదే ఇదే నా అభినందన గీతికా

చరణం 1:

కాశ్మీర అందాలు బాలభారతి
నుదుట తిలకాలు దిద్దగా
పురివిప్పు నాట్యాలు నాట్యభారతి
పాదాల పారాణి అద్దగా
అడుగుల అడుగిడి స్వరమున ముడివడి
అడుగే పైబడి మనసే తడబడి
మయూరివై కదలాడగా
వయ్యారివై నడయాడగా
ఇదే ఇదే ఇదే నా అభినందన గీతికా

చరణం 2:

పయనించు మేఘాలు నిదురించు
సృష్టినే మేలుకొలుపగా
రవళించు మువ్వలు నటరాజు
ఆశీస్సుకై హారతివ్వగా
స్వరమున స్వరమై పదమున పదమై
పదమే స్వరమై స్వరమే వరమై
దేవతవై అగుపించగా
జీవితమే అర్పించగా
ఇదే ఇదే ఇదే నా అభినందన గీతికా

pallavi:

udayagiraṇa rekhalo
hṛdaya vīṇa tīgalo
pāḍinadī ŏga rādhiga
paliginadī rāga māliga
ide ide ide nā abhinaṁdana gīdigā

saraṇaṁ 1:

kāśhmīra aṁdālu bālabhāradi
nuduḍa tilagālu diddagā
purivippu nāṭyālu nāṭyabhāradi
pādāla pārāṇi addagā
aḍugula aḍugiḍi svaramuna muḍivaḍi
aḍuge paibaḍi manase taḍabaḍi
mayūrivai kadalāḍagā
vayyārivai naḍayāḍagā
ide ide ide nā abhinaṁdana gīdigā

saraṇaṁ 2:

payaniṁchu meghālu niduriṁchu
sṛṣhṭine melugŏlubagā
ravaḽiṁchu muvvalu naḍarāju
āśhīssugai hāradivvagā
svaramuna svaramai padamuna padamai
padame svaramai svarame varamai
devadavai agubiṁchagā
jīvidame arbiṁchagā
ide ide ide nā abhinaṁdana gīdigā