Ubasarimchamgaraadaa vuvida gadu nalase

ఉపచరించఁగరాదా వువిద గడు నలసె
Language

(॥పల్లవి॥)
ఉపచరించఁగరాదా వువిద గడు నలసె
నెపమున వురుటెల్ల నెరపీ నీ మీఁదను

(॥ఉప॥)
నలినాక్షి గరిడిలో నంటునఁ గేళిసేసె
మలసి చెక్కులను చెమటగారఁగా
వల పందులోనె చల్లి వాసనగుబ్బలు మోఁపి
నలువంక నీకు నభినయము చూపీని

(॥ఉప॥)
తెరమఱఁగున వచ్చి దేశిశుద్దాంగములను
సరవి నాడి చూపులు సళుపుచును
తిరుపుగొని కమ్మటి తీగెచేతులటు చాఁచి
పరగ నంగరంగవైభవము మెరసీని

(॥ఉప॥)
పదములఁ జిందుజక్కిణి బహుతాళమానముల-
నిదె నాట్యమున నిన్ను నింతి మెప్పించె
అదన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
గదిసి చూడఁగా మతిగరఁగించీని

(||pallavi||)
ubasariṁcham̐garādā vuvida gaḍu nalasĕ
nĕbamuna vuruḍĕlla nĕrabī nī mīm̐danu

(||uba||)
nalinākṣhi gariḍilo naṁṭunam̐ geḽisesĕ
malasi sĕkkulanu sĕmaḍagāram̐gā
vala paṁdulonĕ salli vāsanagubbalu mom̐pi
naluvaṁka nīgu nabhinayamu sūbīni

(||uba||)
tĕramaṟam̐guna vachchi deśhiśhuddāṁgamulanu
saravi nāḍi sūbulu saḽubusunu
tirubugŏni kammaḍi tīgĕsedulaḍu sām̐si
paraga naṁgaraṁgavaibhavamu mĕrasīni

(||uba||)
padamulam̐ jiṁdujakkiṇi bahudāḽamānamula-
nidĕ nāṭyamuna ninnu niṁti mĕppiṁchĕ
adana śhrīveṁkaḍeśha alamelumaṁgā nīvu
gadisi sūḍam̐gā madigaram̐giṁchīni