తొలుతనే మంకువారు దొడ్డివారు
(॥పల్లవి॥)
తొలుతనే మంకువారు దొడ్డివారు
చలములు సాదించితే జడుతురా చెలులు
(॥తొలు॥)
సిగ్గువడి యుండఁగాను చెలి యలిగెనంటాను
యెగ్గులువట్టి తిట్టేవు యేమయ్యా
తగ్గక నీచేసినచేఁతలూఁగాక అందుమీఁద
వెగ్గళించితేఁ జెలులు వెఱతురా యిపుడు
(॥తొలు॥)
పవ్వళించి వుండఁగాను పడఁతి మాటాడదంటా
ఇవ్వల రవ్వసేసే వేమయ్యా
కువ్వలై నీమేనిమీఁద గురుతులూనుండఁగాను
జవ్వనాన జంకించితే సైఁతురా ఇందుకు
(॥తొలు॥)
పట్టి కాఁగిలించుకోఁగా బలిమిసేసీనంటా
ఇట్టునట్టుఁ బెనఁగేవు వేమయ్య
గుట్టున శ్రీవేంకటేశ కూడితివి మగువను
వెట్టికిఁ గొసరితేను విడుత(తు?) రా పంతము
(||pallavi||)
tŏludane maṁkuvāru dŏḍḍivāru
salamulu sādiṁchide jaḍudurā sĕlulu
(||tŏlu||)
sigguvaḍi yuṁḍam̐gānu sĕli yaligĕnaṁṭānu
yĕgguluvaṭṭi tiṭṭevu yemayyā
taggaga nīsesinasem̐talūm̐gāga aṁdumīm̐da
vĕggaḽiṁchidem̐ jĕlulu vĕṟadurā yibuḍu
(||tŏlu||)
pavvaḽiṁchi vuṁḍam̐gānu paḍam̐ti māḍāḍadaṁṭā
ivvala ravvasese vemayyā
kuvvalai nīmenimīm̐da gurudulūnuṁḍam̐gānu
javvanāna jaṁkiṁchide saim̐turā iṁdugu
(||tŏlu||)
paṭṭi kām̐giliṁchugom̐gā balimisesīnaṁṭā
iṭṭunaṭṭum̐ bĕnam̐gevu vemayya
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍidivi maguvanu
vĕṭṭigim̐ gŏsaridenu viḍuda(tu?) rā paṁtamu