తోలుబొమ్మలము నీవే తొడరి యాడింతుగాక
(॥పల్లవి॥)
తోలుబొమ్మలము నీవే తొడరి యాడింతుగాక
యీలీల నుండిన నేము యేమి సేతుమయ్యా
(॥తోలు॥)
నేరువు గలిగికా నీతో మాటాడుట
కూరిమి గలిగికా కొసరుటా
సారమెఱఁగనయట్టి చప్పని వారము నేము
యీరీతి నూరకుండక యేమి సేతుమయ్యా
(॥తోలు॥)
నీమన సెఱిఁగికా నిన్నుఁ గరఁగించుట
నేను మెఱిఁగితేగా నిన్నుఁ బొందుటా
చేముట్టి పెనఁగలేనిసిగ్గరివారము నేము
యీమేర నుందుముగాక మేమిసేతుమయ్యా
(॥తోలు॥)
చనవరులమైకా సందులెల్లాఁ జేకొనుట
ఘనులమైతేఁగా కైకొనుటా
యెనసితివి శ్రీవేంకటేశ మమ్ము మన్నించి
యినుమడై యుందుంకాక యేమి సేతుమయ్యా
(||pallavi||)
tolubŏmmalamu nīve tŏḍari yāḍiṁtugāga
yīlīla nuṁḍina nemu yemi sedumayyā
(||tolu||)
neruvu galigigā nīdo māḍāḍuḍa
kūrimi galigigā kŏsaruḍā
sāramĕṟam̐ganayaṭṭi sappani vāramu nemu
yīrīdi nūraguṁḍaga yemi sedumayyā
(||tolu||)
nīmana sĕṟim̐gigā ninnum̐ garam̐giṁchuḍa
nenu mĕṟim̐gidegā ninnum̐ bŏṁduḍā
semuṭṭi pĕnam̐galenisiggarivāramu nemu
yīmera nuṁdumugāga memisedumayyā
(||tolu||)
sanavarulamaigā saṁdulĕllām̐ jegŏnuḍa
ghanulamaidem̐gā kaigŏnuḍā
yĕnasidivi śhrīveṁkaḍeśha mammu manniṁchi
yinumaḍai yuṁduṁkāga yemi sedumayyā