Tollimta neravu neevu doragonna kuchchidaalu

తొల్లింత నేరవు నీవు దొరకొన్న కుచ్చితాలు
Language

(॥పల్లవి॥)
తొల్లింత నేరవు నీవు దొరకొన్న కుచ్చితాలు
చల్లనిదే కాదా వెల్లి చాపకిందిది

(॥తొల్లిం॥)
పయ్యదలోపలినా బలుపుగుబ్బలు నీవు
చెయ్యంటక తెలుసునా జిగి నామేను
వొయ్యన నా మనసేమి వొరసేవు మాఁటలను
గయ్యాళితనా లెవ్వతె గరపెవో నీకును

(॥తొల్లిం॥)
పానుపు మీఁదట నాపంతపురతుల నీవు
మేనుచొక్క కెఱిఁగేవా మించు నాగుట్టు
మోనాన నుండి నాతమి ముందేమి వెలుచుకొంటి
వానటన లెన్నాళ్లనుం డట్టె నేర్చుకొంటివో

(॥తొల్లిం॥)
కాఁగిటిలోపలి నాకరఁగు లిట్లా నీవు
చేఁగదేరక నమ్మేవా శ్రీ వేంకటేశ
మాఁగినమోవి చేకొని మన్నించితి వెంతకెంత
వీఁగని మహిమ లెన్ని వేవేలు గలవో

(||pallavi||)
tŏlliṁta neravu nīvu dŏragŏnna kuchchidālu
sallanide kādā vĕlli sābagiṁdidi

(||tŏlliṁ||)
payyadalobalinā balubugubbalu nīvu
sĕyyaṁṭaga tĕlusunā jigi nāmenu
vŏyyana nā manasemi vŏrasevu mām̐ṭalanu
gayyāḽidanā lĕvvadĕ garabĕvo nīgunu

(||tŏlliṁ||)
pānubu mīm̐daḍa nābaṁtaburadula nīvu
menusŏkka kĕṟim̐gevā miṁchu nāguṭṭu
monāna nuṁḍi nādami muṁdemi vĕlusugŏṁṭi
vānaḍana lĕnnāḽlanuṁ ḍaṭṭĕ nersugŏṁṭivo

(||tŏlliṁ||)
kām̐giḍilobali nāgaram̐gu liṭlā nīvu
sem̐gaderaga nammevā śhrī veṁkaḍeśha
mām̐ginamovi segŏni manniṁchidi vĕṁtagĕṁta
vīm̐gani mahima lĕnni vevelu galavo