తొల్లిటి నాకంటెను దొడ్డదా తాను
(॥పల్లవి॥)
తొల్లిటి నాకంటెను దొడ్డదా తాను
పల్లదాలు నేర్చితేనే బలిమి గలిగీనా
(॥తొల్లి॥)
రమణునియెదుటనే రాజసముచూపీని
తిమురుచు నిందుఁగాని తేటపడదా
తమకించి మురిసీని తా నిన్నాళ్లదేకాదా
కొమరె వయసైతే నెక్కుడుగర్వ మెక్కెనా
(॥తొల్లి॥)
మగఁడు లినఁగానే మాట లెన్ని యాడీనే
పగ టిందుఁగాని యేరుపడదాయనా
నగీ నూరకయైనా నాతులలోనెల్లాను
మిగులా వలచితేనే మేర మీరవలెనా
(॥తొల్లి॥)
శ్రీవేంకటేశువద్దనే చేఁత లెన్ని సేసీనే
కావర మిందునఁగాని కానిపించదా
యీవేళఁ దన్నుఁగూడి యీతఁడే నన్ను నేలె
వావి చెప్పీ దీనివల్ల వన్నె వచ్చెనా
(||pallavi||)
tŏlliḍi nāgaṁṭĕnu dŏḍḍadā tānu
palladālu nersidene balimi galigīnā
(||tŏlli||)
ramaṇuniyĕduḍane rājasamusūbīni
timurusu niṁdum̐gāni teḍabaḍadā
tamagiṁchi murisīni tā ninnāḽladegādā
kŏmarĕ vayasaide nĕkkuḍugarva mĕkkĕnā
(||tŏlli||)
magam̐ḍu linam̐gāne māḍa lĕnni yāḍīne
paga ṭiṁdum̐gāni yerubaḍadāyanā
nagī nūragayainā nādulalonĕllānu
migulā valasidene mera mīravalĕnā
(||tŏlli||)
śhrīveṁkaḍeśhuvaddane sem̐ta lĕnni sesīne
kāvara miṁdunam̐gāni kānibiṁchadā
yīveḽam̐ dannum̐gūḍi yīdam̐ḍe nannu nelĕ
vāvi sĕppī dīnivalla vannĕ vachchĕnā