తొలి వలపే తీయనిది...
పల్లవి:
తొలి వలపే తీయనిది
ఆ దాహం తీరనది
కాలం లా కరిగిపోనిది
ప్రాణం లా తిరిగి పోదది
తొలి వలపే తీయనిది
ఆ దాహం తీరనది
కాలం లా కరిగిపోనిది
ప్రాణం లా తిరిగి పోదది
చరణం 1:
వేదంలాగా లిపి లేనిది
వేదిస్తున్న సుఖమైనది
ఓడిస్తున్న గెలుపే అది
ఓదార్చే ఓ పిలుపైనది
చుక్కలనే నిలుపునది
దిక్కులనే కలుపునది
ఆకాశం తానై ఉన్నది
ఒక్కరిలో ఇద్దరది
ఇద్దరిలో ఒక్కటది
నీకోసం నేనై ఉన్నది
తొలి వలపే ... ఆ బాధే..
చరణం 2:
గుండెల్లోన గూడే ఇది
గుచ్చే రోజా మాలే అది
మాటల్లోన మౌనం అది
మనసుల్లోన ధ్యానం అది
ఏ ఋణమో తెలియనిది
ఏ వరము అడగనిది
ఏ మజిలి చేరేనో అది
ఎప్పటిదో ఎరుగనిది
ఎన్నటికి మరువనిది
ఓ కధలా చేరే కంచికి
తొలి వలపే తీయనిది
ఆ బాధే తీరనది
ఎదకన్న లోతుగుంటది
బ్రతుకల్లె తోడూ ఉంటది
pallavi:
tŏli valabe tīyanidi
ā dāhaṁ tīranadi
kālaṁ lā karigibonidi
prāṇaṁ lā tirigi podadi
tŏli valabe tīyanidi
ā dāhaṁ tīranadi
kālaṁ lā karigibonidi
prāṇaṁ lā tirigi podadi
saraṇaṁ 1:
vedaṁlāgā libi lenidi
vedistunna sukhamainadi
oḍistunna gĕlube adi
odārse o pilubainadi
sukkalane nilubunadi
dikkulane kalubunadi
āgāśhaṁ tānai unnadi
ŏkkarilo iddaradi
iddarilo ŏkkaḍadi
nīgosaṁ nenai unnadi
tŏli valabe ... ā bādhe..
saraṇaṁ 2:
guṁḍĕllona gūḍe idi
guchche rojā māle adi
māḍallona maunaṁ adi
manasullona dhyānaṁ adi
e ṛṇamo tĕliyanidi
e varamu aḍaganidi
e majili sereno adi
ĕppaḍido ĕruganidi
ĕnnaḍigi maruvanidi
o kadhalā sere kaṁchigi
tŏli valabe tīyanidi
ā bādhe tīranadi
ĕdaganna loduguṁṭadi
bradugallĕ toḍū uṁṭadi