Toli soobu oga parisayam

తొలి చూపు ఒక పరిచయం
Year
Language

పల్లవి:

తొలి చూపు ఒక పరిచయం
మలి చూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో... ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం అనురాగపు తొలి రంగం

తొలి చూపు ఒక పరిచయం
మలి చూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో... ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం అనురాగపు తొలి రంగం

తొలి చూపు ఒక పరిచయం... మలి చూపు ఒక అనుభవం

చరణం 1:

ఒక పువ్వు పూచిన చోట... ఆ పువ్వు నవ్విన చోట
ఒక పువ్వు పూచిన చోట... ఆ పువ్వు నవ్విన చోట
వెలిసింది దేవాలయం అదే ప్రేమాలయం...

ఒక రాగం పిలిచిన చోట... అనురాగం పలికిన చోట
వెలిసింది రాగాలయం... అదే ప్రేమాలయం
...అదే ప్రేమాలయం || తొలి చూపు ||

చరణం 2:

మలి సంధ్య ముగిసిన చోట... జాబిల్లి విరిసిన చోట
మలి సంధ్య ముగిసిన చోట... జాబిల్లి విరిసిన చోట
వెలిసింది హృదయాలయం... అదే ప్రేమాలయం..

ఆకాశం వంగిన చోట... భూదేవిని తాకిన చోట
వెలిసింది ఒక ఆలయం... అదే ప్రేమాలయం
...అదే ప్రేమాలయం || తొలి చూపు ||

pallavi:

tŏli sūbu ŏga parisayaṁ
mali sūbu ŏga anubhavaṁ
ī sūbula ūsulalo... ā kannula kalayigalo
jarige tadaṁgaṁ anurāgabu tŏli raṁgaṁ

tŏli sūbu ŏga parisayaṁ
mali sūbu ŏga anubhavaṁ
ī sūbula ūsulalo... ā kannula kalayigalo
jarige tadaṁgaṁ anurāgabu tŏli raṁgaṁ

tŏli sūbu ŏga parisayaṁ... mali sūbu ŏga anubhavaṁ

saraṇaṁ 1:

ŏga puvvu pūsina soḍa... ā puvvu navvina soḍa
ŏga puvvu pūsina soḍa... ā puvvu navvina soḍa
vĕlisiṁdi devālayaṁ ade premālayaṁ...

ŏga rāgaṁ pilisina soḍa... anurāgaṁ paligina soḍa
vĕlisiṁdi rāgālayaṁ... ade premālayaṁ
...ade premālayaṁ || tŏli sūbu ||

saraṇaṁ 2:

mali saṁdhya mugisina soḍa... jābilli virisina soḍa
mali saṁdhya mugisina soḍa... jābilli virisina soḍa
vĕlisiṁdi hṛdayālayaṁ... ade premālayaṁ..

āgāśhaṁ vaṁgina soḍa... bhūdevini tāgina soḍa
vĕlisiṁdi ŏga ālayaṁ... ade premālayaṁ
...ade premālayaṁ || tŏli sūbu ||