తిట్టితేనే యెగ్గుగాక తేఁకువతో నాతనికి
(॥పల్లవి॥)
తిట్టితేనే యెగ్గుగాక తేఁకువతో నాతనికి
చుట్టరికము చూపితే సొంపుగాదా నీకు
(॥తిట్టి॥)
మచ్చికతో నీవిభుఁడు మాఁటలు నీతో నాడఁగా
మెచ్చితే నేమాయెనే మేలుగాదా
ముచ్చట నాతఁడు నాపె మోహములు చల్లఁగాను
వచ్చి వద్దఁగూచుండితే వాడికగాదా
(॥తిట్టి॥)
పువ్వుల వేసి యాతఁడు పొందు నాతోఁ జేయఁగాను
నవ్వితే నేమాయనే నాయమేకాదా
వువ్విళ్లూర నాతఁడు నావొడిమీఁదఁ గూచుండఁగా
చివ్వనఁ గొప్పువెట్టితే సింగారముగాదా
(॥తిట్టి॥)
వీడెమిచ్చి నన్నాతఁడు వెసఁ గాఁగిలించుకోఁగా
కూడితే నేమాయనే వేడుకేకాదా
యీడనె శ్రీవేంకటేశుఁ డిటు నిన్ను నన్నుఁ గూడె
వూడిగాలు నేఁజేసితే నీడుజోడుగాదా
(||pallavi||)
tiṭṭidene yĕggugāga tem̐kuvado nādanigi
suṭṭarigamu sūbide sŏṁpugādā nīgu
(||tiṭṭi||)
machchigado nīvibhum̐ḍu mām̐ṭalu nīdo nāḍam̐gā
mĕchchide nemāyĕne melugādā
muchchaḍa nādam̐ḍu nābĕ mohamulu sallam̐gānu
vachchi vaddam̐gūsuṁḍide vāḍigagādā
(||tiṭṭi||)
puvvula vesi yādam̐ḍu pŏṁdu nādom̐ jeyam̐gānu
navvide nemāyane nāyamegādā
vuvviḽlūra nādam̐ḍu nāvŏḍimīm̐dam̐ gūsuṁḍam̐gā
sivvanam̐ gŏppuvĕṭṭide siṁgāramugādā
(||tiṭṭi||)
vīḍĕmichchi nannādam̐ḍu vĕsam̐ gām̐giliṁchugom̐gā
kūḍide nemāyane veḍugegādā
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍiḍu ninnu nannum̐ gūḍĕ
vūḍigālu nem̐jeside nīḍujoḍugādā