Tilottamaa priya vayyaaramaa

తిలోత్తమా ప్రియ వయ్యారమా
Work
Year
Language

పల్లవి:

తిలోత్తమా.. ప్రియ వయ్యారమా
ప్రభాతమా.. శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది
ఆ... తిలోత్తమా ప్రియ వయ్యారమా...

చరణం 1:

పెదవే.. ఓ మధుర కవిత చదివే
అడుగే.. నా గడపనొదిలి కదిలే
ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణీ ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా
ఈ మాయ చేసింది ప్రేమే
ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే
తిలోత్తమా...సుఖ వసంతమా

చరణం 2:

కలలే... నా ఎదుట నిలిచె నిజమై
వలపే... నా ఒడికి దొరికె వరమై
ఏ రాహువైనా ఆషాఢమైనా ఈ బాహుబంధాన్ని విడదీయునా
నీ మాటలే వేదమంత్రం
చెలి నువ్వన్నదే నా ప్రపంచం

తిలోత్తమా.. ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది

pallavi:

tilottamā.. priya vayyāramā
prabhādamā.. śhubha vasaṁtamā
ne moyalenaṁṭū hṛdayānni aṁdiṁchā
nenunnā lĕmmaṁṭū adi nālo dāseśhā
e dārilo sāgudunnā ĕda nīvaibuge lāgudoṁdi
e veḽalo ĕppuḍainā madi nī ūhalo ūgudoṁdi
ā... tilottamā priya vayyāramā...

saraṇaṁ 1:

pĕdave.. o madhura kavida sadive
aḍuge.. nā gaḍabanŏdili kadile
innāḽḽu leni ī kŏtta bāṇī ivvāḽe managĕvaru nerbārammā
ī māya sesiṁdi preme
priyā premaṁṭe ŏgaḍaina maname
tilottamā...sukha vasaṁtamā

saraṇaṁ 2:

kalale... nā ĕduḍa nilisĕ nijamai
valabe... nā ŏḍigi dŏrigĕ varamai
e rāhuvainā āṣhāḍhamainā ī bāhubaṁdhānni viḍadīyunā
nī māḍale vedamaṁtraṁ
sĕli nuvvannade nā prabaṁchaṁ

tilottamā.. priya vayyāramā
prabhādamā śhubha vasaṁtamā
ne moyalenaṁṭū hṛdayānni aṁdiṁchā
nenunnā lĕmmaṁṭū adi nālo dāseśhā
e dārilo sāgudunnā ĕda nīvaibuge lāgudoṁdi
e veḽalo ĕppuḍainā madi nī ūhalo ūgudoṁdi