తేరిచూడు మిదివో నీదేవుల దిక్కు
(॥పల్లవి॥)
తేరిచూడు మిదివో నీదేవుల దిక్కు
సారెసారెఁ దన మోవిచవులు చూపీని
(॥తేరి॥)
పొంచి నీమోము చూచీ పొలఁతిఁతల
వంచి సిగ్గులు పచరించీ నదె
పెంచీ నాసలుఁ గడుఁబ్రేమమున లోలో
నించీ సెలవులను నిండునగవులు
(॥తేరి॥)
సొలసి మాఁటలాడీ సుదతిఁ నీతోఁ
గలసి మెలసి యాడి యలసీ నదె
మలసీనీముందురను మంతనానను
వలసినట్ల నీపై వలపు చల్లీని
(॥తేరి॥)
పొంది నీకాఁగిటను పూఁబోణి
చిందీఁ జెమట లంది యంది
చెందితి విటు నన్ను శ్రీవేంకటేశ్వర
సందినుండి తాను చనవు సేసీని
(||pallavi||)
terisūḍu midivo nīdevula dikku
sārĕsārĕm̐ dana movisavulu sūbīni
(||teri||)
pŏṁchi nīmomu sūsī pŏlam̐tim̐tala
vaṁchi siggulu pasariṁchī nadĕ
pĕṁchī nāsalum̐ gaḍum̐bremamuna lolo
niṁchī sĕlavulanu niṁḍunagavulu
(||teri||)
sŏlasi mām̐ṭalāḍī sudadim̐ nīdom̐
galasi mĕlasi yāḍi yalasī nadĕ
malasīnīmuṁduranu maṁtanānanu
valasinaṭla nībai valabu sallīni
(||teri||)
pŏṁdi nīgām̐giḍanu pūm̐boṇi
siṁdīm̐ jĕmaḍa laṁdi yaṁdi
sĕṁdidi viḍu nannu śhrīveṁkaḍeśhvara
saṁdinuṁḍi tānu sanavu sesīni