తేనెలు మోవి నూరె తెల్లవారెను
(॥పల్లవి॥)
తేనెలు మోవి నూరె తెల్లవారెను
నానెఁ జెమటల మేను నవ్వితి నేననవే
(॥తేనె॥)
గోరికొన వాఁడేయ కుచములు వేఁడేయ
గారవాన నేఁడు తనకాఁగిటిలోన
తారుకాణ లిదె వచ్చె తమకము గడుహెచ్చె
చేరి నన్ను మన్నించి చిత్తగించుమనవే
(॥తేనె॥)
నిట్టూర్పులు బెట్టాయ నేరుపులు రట్టాయ
పట్టరానివయసుతో పానుపుమీఁద
నెట్టుకొనె నడియాస నిజమాయఁ దనబాస
యెట్టఇనాఁ దనమాట లియ్యకొంటిననవే
(॥తేనె॥)
వేడుకలు మతి నిండె వెస వలపిదె పండె
మాడుపుటింటిలో తెరమఱఁగునను
యీడనె శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నింతలోనె
వీడే లందుకొంటి మిఁక వేసరవద్దననే
(||pallavi||)
tenĕlu movi nūrĕ tĕllavārĕnu
nānĕm̐ jĕmaḍala menu navvidi nenanave
(||tenĕ||)
gorigŏna vām̐ḍeya kusamulu vem̐ḍeya
gāravāna nem̐ḍu tanagām̐giḍilona
tārugāṇa lidĕ vachchĕ tamagamu gaḍuhĕchchĕ
seri nannu manniṁchi sittagiṁchumanave
(||tenĕ||)
niṭṭūrbulu bĕṭṭāya nerubulu raṭṭāya
paṭṭarānivayasudo pānubumīm̐da
nĕṭṭugŏnĕ naḍiyāsa nijamāyam̐ danabāsa
yĕṭṭa̮inām̐ danamāḍa liyyagŏṁṭinanave
(||tenĕ||)
veḍugalu madi niṁḍĕ vĕsa valabidĕ paṁḍĕ
māḍubuḍiṁṭilo tĕramaṟam̐gunanu
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu niṁtalonĕ
vīḍe laṁdugŏṁṭi mim̐ka vesaravaddanane