తెలుసుకోవయ్యా యీపె తెఱఁగు విచారించి
(॥పల్లవి॥)
తెలుసుకోవయ్యా యీపె తెఱఁగు విచారించి
వులివచ్చి తమితోడ నుమ్మగిల నేఁటికి
(॥తెలు॥)
తేనెలూర పాటవాడి తెరలోన మాటలాడీ
యా నెలఁత చక్కఁదన మెటువంటిదో
తానాలు వుట్టి వీణెతంత్రులెల్లా బిగిఇంచు
గానవిద్య యాపె యెంత కడునెరవాదియో
(॥తెలు॥)
పంతమున నవ్వు నవ్వి పయ్యదలో దాఁచుకొనీ
యెంతలేసి గొప్పలో యాపె చన్నులు
దొంతిఁ బెట్టి వలపులు తొంగి తొంగి చూచీని
చెంత నిట్టె యాపె యెట్టి చేఁతలాఁడియో
(॥తెలు॥)
చెలులతోఁ జెప్పిపంపి సేసలు నీపైఁ జల్లీ
ఇలఁ గలికితనాల నెంతటిజాణో
యెలమి శ్రీవేంకటేశ యాకె యలమేలుమంగ
తెలిపి పెండ్లాడె నెంత దిట్ట కతకారియో
(||pallavi||)
tĕlusugovayyā yībĕ tĕṟam̐gu visāriṁchi
vulivachchi tamidoḍa nummagila nem̐ṭigi
(||tĕlu||)
tenĕlūra pāḍavāḍi tĕralona māḍalāḍī
yā nĕlam̐ta sakkam̐dana mĕḍuvaṁṭido
tānālu vuṭṭi vīṇĕdaṁtrulĕllā bigiiṁchu
gānavidya yābĕ yĕṁta kaḍunĕravādiyo
(||tĕlu||)
paṁtamuna navvu navvi payyadalo dām̐sugŏnī
yĕṁtalesi gŏppalo yābĕ sannulu
dŏṁtim̐ bĕṭṭi valabulu tŏṁgi tŏṁgi sūsīni
sĕṁta niṭṭĕ yābĕ yĕṭṭi sem̐talām̐ḍiyo
(||tĕlu||)
sĕluladom̐ jĕppibaṁpi sesalu nībaim̐ jallī
ilam̐ galigidanāla nĕṁtaḍijāṇo
yĕlami śhrīveṁkaḍeśha yāgĕ yalamelumaṁga
tĕlibi pĕṁḍlāḍĕ nĕṁta diṭṭa kadagāriyo