తెలుసుకోరాదా తెఱవ తలఁపులెల్లా
(॥పల్లవి॥)
తెలుసుకోరాదా తెఱవ తలఁపులెల్లా
వెలినుండి ముందే యాల వేగిరించేవు
(॥తెలు॥)
వాసితోడ మదిరాక్షి వచ్చినపని వుండఁగా
నీ సుద్దు లేమి చెప్పేవే నేరుపులను
మూసిన ముత్తెమువలె మొనసి నిన్నుఁజూడఁగా
సేసవెట్టిన సతులఁ జెలి యేమి చూపేవు
(॥తెలు॥)
లలితాంగి నీరతికి లాచి కాచుకుండఁగాను
యెలమి జూజాలాడ నేమి నేర్పేవు
బలిమిఁ జన్నులొరయఁ బాదాలొత్తరాఁగాను
మలసి వట్టిపనులు మరియేల చెప్పేవు
(॥తెలు॥)
పడఁతి నీకాఁగిటిలోఁ బాదుకొని వుండఁగాను
యెడయక కంఠహారా లెన్ని గట్టేవు
నడుమ శ్రీవేంకటేశ నన్ను నేలితివిప్పడు
వొడఁబరచి యాపెను వొడి యేల పట్టేవు
(||pallavi||)
tĕlusugorādā tĕṟava talam̐pulĕllā
vĕlinuṁḍi muṁde yāla vegiriṁchevu
(||tĕlu||)
vāsidoḍa madirākṣhi vachchinabani vuṁḍam̐gā
nī suddu lemi sĕppeve nerubulanu
mūsina muttĕmuvalĕ mŏnasi ninnum̐jūḍam̐gā
sesavĕṭṭina sadulam̐ jĕli yemi sūbevu
(||tĕlu||)
lalidāṁgi nīradigi lāsi kāsuguṁḍam̐gānu
yĕlami jūjālāḍa nemi nerbevu
balimim̐ jannulŏrayam̐ bādālŏttarām̐gānu
malasi vaṭṭibanulu mariyela sĕppevu
(||tĕlu||)
paḍam̐ti nīgām̐giḍilom̐ bādugŏni vuṁḍam̐gānu
yĕḍayaga kaṁṭhahārā lĕnni gaṭṭevu
naḍuma śhrīveṁkaḍeśha nannu nelidivippaḍu
vŏḍam̐barasi yābĕnu vŏḍi yela paṭṭevu