Telusugonevu neevu dinadinagadulanu

తెలుసుకొనేవు నీవు దినదినగతులను
Language

(॥పల్లవి॥)
తెలుసుకొనేవు నీవు దినదినగతులను
సొలసితే నావంటి సులభము లున్నవా

(॥తెలు॥)
చనవరికాంతవల్ల సళుపుఁజూపులెకాక
పెనఁగఁబోతే నందుఁ బ్రియమున్నదా
ననుపైనకాంతవల్ల నగవే మిక్కిలిగాక
తనివోనిరదులతో దప్పిదేరనున్న దా

(॥తెలు॥)
జారకాంతవల్ల పొందుచవి వేగిరమేకాక
కోరినట్టెల్లా నుండి కూడనున్న దా
తేరవచ్చే కంతవల్ల తీరుకుఁ దేనేకాక
పోరచి నంకెకును భోగించనున్నదా

(॥తెలు॥)
కొత్తయినకాంతవల్లకొంకులు సిగ్గులుఁగాక
హత్తి సుసరాన రతి యందనున్న దా
ఇత్తల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
యెత్తినసంతోసము నీ కిటువలె నున్నదా

(||pallavi||)
tĕlusugŏnevu nīvu dinadinagadulanu
sŏlaside nāvaṁṭi sulabhamu lunnavā

(||tĕlu||)
sanavarigāṁtavalla saḽubum̐jūbulĕgāga
pĕnam̐gam̐bode naṁdum̐ briyamunnadā
nanubainagāṁtavalla nagave mikkiligāga
tanivoniradulado dappideranunna dā

(||tĕlu||)
jāragāṁtavalla pŏṁdusavi vegiramegāga
korinaṭṭĕllā nuṁḍi kūḍanunna dā
teravachche kaṁtavalla tīrugum̐ denegāga
porasi naṁkĕgunu bhogiṁchanunnadā

(||tĕlu||)
kŏttayinagāṁtavallagŏṁkulu siggulum̐gāga
hatti susarāna radi yaṁdanunna dā
ittala śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
yĕttinasaṁtosamu nī kiḍuvalĕ nunnadā