Telugu padaanigi janmadinam

తెలుగు పదానికి జన్మదినం
Work
Year
Language

పల్లవి:

ఓం ఓం.....
తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానపధం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

చరణం 1:

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశిస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో
గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ
ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతి గానవు
మహిమలు తెలిసి
సితహిమ కందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ
తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము
నందనానంద కారకము
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

చరణం 2:

పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురు
పోయగా
విష్ణు తేజమై నాద బీజమై అంధ్ర సాహితి అమర
కోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించేను అన్నమయ్య అసతోమా సద్గమయ

చరణం 3:

పాపడుగా నట్టింట పాకుతు భాగవతము
చేప్పట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు
కలయా
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ

pallavi:

oṁ oṁ.....
tĕlugu padānigi janmadinaṁ
idi jāna padānigi jñānabadhaṁ
eḍu svarāle eḍu kŏṁḍalai vĕlasina kaliyuga viṣhṇu padaṁ
annamayya jananaṁ
idi annamayya jananaṁ
idi annamayya jananaṁ

saraṇaṁ 1:

ariṣhaḍvargamu tĕganarige harikhaḍgammidi naṁdagamu
brahmalogamuna brahmabhāradi nādāśhissulu pŏṁdinadai
śhivalogammuna sidvilāsamuna ḍamarudhvanilo
gamagidamai
divyasabhalalo navyalāsyamula pūbaṁtula sebaṁtiga
ĕgasi
nīrada maṁḍala nārada tuṁbura mahadi gānavu
mahimalu tĕlisi
sidahima kaṁdara yadirāṭsabhalo tabaḥ phalammuga
taḽugumani
talli tanamugai tallaḍillu ā lakka māṁba garbhālayammulo
praveśhiṁchĕ ā naṁdagamu
naṁdanānaṁda kāragamu
annamayya jananaṁ
idi annamayya jananaṁ
idi annamayya jananaṁ

saraṇaṁ 2:

padmāvadiye puruḍu poyagā padmāsanuḍe usuru
poyagā
viṣhṇu tejamai nāda bījamai aṁdhra sāhidi amara
kośhamai
avadariṁchĕnu annamayya asadomā sadgamaya
avadariṁchenu annamayya asadomā sadgamaya

saraṇaṁ 3:

pābaḍugā naṭṭiṁṭa pāgudu bhāgavadamu
seppaṭṭĕnayā
harināmammunu ālagiṁchaga aramuddalane muṭṭaḍayā
tĕlugu bhāradigi vĕlugu hāradai ĕdalayalo pada kavidalu
kalayā
tāḽḽabāgalo ĕdigĕ annamayya tamasomā jyodirgamaya
tamasomā jyodirgamaya
tamasomā jyodirgamaya