Telugamdaale

తెలుగందాలే
Work
Year
Language

పల్లవి:

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడీ పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చనీ వెల్లువై
సాగప గపప గసదా రిసదా
సాగప గపప గసదా రిసదా
కాటుకా కళ్ళలో కన్నెవాకిళ్ళలో...

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

చరణం 1:

తిక్కనలో తియ్యదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం నవ పద్మావతీ పాదం
ఓ.. రాగానికే అందం రసగీతగోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వేళా రాగదీపిక

సాగప గపప గసదా రిసదా
సాగప గపప గసదా రిసదా
హా.. కాటుకా కళ్ళలో కన్నెవాకిళ్ళలో...

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

చరణం 2:

క్షేత్రయలో జాణతనం వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరీ
ఆ.. ఏకం కావాలిలే ఏడుజన్మల బంధాలివీ
కృష్ణవేణి జడలో శైలమల్లికా
శివుడి ఆలయానా భ్రమర దీపిక

సాగప గపప గసదా రిసదా
సాగప గపప గసదా రిసదా
హా.. కాటుకా కళ్ళలో కన్నెవాకిళ్ళలో...

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

pallavi:

tĕlugaṁdāle nannu tŏṁgi tŏṁgi sūsĕnamma tŏlagarigā
magaraṁdāle madi pŏṁgi pŏṁgi poyĕnamma tuṁṭarigā
ammaḍi siggule gummaḍī puvvulai
pillaḍi pallave pachchanī vĕlluvai
sāgaba gabapa gasadā risadā
sāgaba gabapa gasadā risadā
kāḍugā kaḽḽalo kannĕvāgiḽḽalo...

tĕlugaṁdāle nannu tŏṁgi tŏṁgi sūsĕnamma tŏlagarigā
magaraṁdāle madi pŏṁgi pŏṁgi poyĕnamma tuṁṭarigā

saraṇaṁ 1:

tikkanalo tiyyadanaṁ libi sakkani nī kannĕdanaṁ
podanalo rāmarasaṁ vaḍabosĕnu nī premarasaṁ
prāyānige vedaṁ nava padmāvadī pādaṁ
o.. rāgānige aṁdaṁ rasagīdagoviṁdaṁ
vaṁśhadhāra ŏḍilo harṣhavalligā
sūryagāṁta veḽā rāgadībiga

sāgaba gabapa gasadā risadā
sāgaba gabapa gasadā risadā
hā.. kāḍugā kaḽḽalo kannĕvāgiḽḽalo...

tĕlugaṁdāle nannu tŏṁgi tŏṁgi sūsĕnamma tŏlagarigā
magaraṁdāle madi pŏṁgi pŏṁgi poyĕnamma tuṁṭarigā

saraṇaṁ 2:

kṣhetrayalo jāṇadanaṁ varadayyĕnule valabudanaṁ
aṁdani nī āḍadanaṁ amarāvadilo śhilbadhanaṁ
eḍuga sīliṁdile nadi gaudami godāvarī
ā.. egaṁ kāvālile eḍujanmala baṁdhālivī
kṛṣhṇaveṇi jaḍalo śhailamalligā
śhivuḍi ālayānā bhramara dībiga

sāgaba gabapa gasadā risadā
sāgaba gabapa gasadā risadā
hā.. kāḍugā kaḽḽalo kannĕvāgiḽḽalo...

tĕlugaṁdāle nannu tŏṁgi tŏṁgi sūsĕnamma tŏlagarigā
magaraṁdāle madi pŏṁgi pŏṁgi poyĕnamma tuṁṭarigā