తెలియఁ జెప్పఁగవలె తెలుసునో తెలియదో
(॥పల్లవి॥)
తెలియఁ జెప్పఁగవలె తెలుసునో తెలియదో
మెలుపున నీకు నమ్మినదాన నేను
(॥॥)
మచ్చరించ నేరఁగాని మనసిచ్చి నీతోడ-
నిచ్చకమాడనేరుతు నిందరికంటె
కుచ్చితురాలఁ గాను గుణము తెలుసుకొంటే
హెచ్చుఁగుందు లేనట్టిహితవరి నేను
(॥॥)
గద్దించనోపఁగాని కలకాలము నీకు
బుద్దులు చెప్పనోపుదు పొందులుగాను
వుద్దండపుదానఁగాను వొద్దికై యెప్పుడు నీ-
తిద్దుతీరుకు వచ్చినదేవుల నేను
(॥॥)
వేసరించఁజాలఁగాని, వేడుక శ్రీవేంకటేశ
ఆస వుట్టించఁ జాలుదు నన్నిరతుల
రేసులదానఁగాను రేపును మాపునునీకు
సేసవెట్టి పెండ్లాడినచిన్నదాన నేను
(||pallavi||)
tĕliyam̐ jĕppam̐gavalĕ tĕlusuno tĕliyado
mĕlubuna nīgu namminadāna nenu
(||||)
machchariṁcha neram̐gāni manasichchi nīdoḍa-
nichchagamāḍanerudu niṁdarigaṁṭĕ
kuchchidurālam̐ gānu guṇamu tĕlusugŏṁṭe
hĕchchum̐guṁdu lenaṭṭihidavari nenu
(||||)
gaddiṁchanobam̐gāni kalagālamu nīgu
buddulu sĕppanobudu pŏṁdulugānu
vuddaṁḍabudānam̐gānu vŏddigai yĕppuḍu nī-
tiddudīrugu vachchinadevula nenu
(||||)
vesariṁcham̐jālam̐gāni, veḍuga śhrīveṁkaḍeśha
āsa vuṭṭiṁcham̐ jāludu nanniradula
resuladānam̐gānu rebunu mābununīgu
sesavĕṭṭi pĕṁḍlāḍinasinnadāna nenu