Telisidi nee suddulu tedadellamiga nenu

తెలిసితి నీ సుద్దులు తేటతెల్లమిగ నేను
Language

(॥పల్లవి॥)
తెలిసితి నీ సుద్దులు తేటతెల్లమిగ నేను
మలసి నన్నిఁక నీవు మన్నించవయ్యా

(॥తెలి॥)
వువ్విళ్లూర మాఁటలాడి వొడఁబరచేవు నీవు
యెవ్వతె నేరిపె నీకు నింతేసి యయ్యా
నవ్వినవ్వి వేఁగినంతా నలిఁ బొద్దులువుచ్చేవు
అవ్వల నీవల పెందు నాహివెట్టితివయ్యా

(॥తెలి॥)
వొద్దికె నేఁ జెనకితే నొడ్డించుకొనేవు యీ
విద్దెలు యేపళ్లిఁ జదివితివయ్యా
చద్దికి వేఁడికి నాపై సరసాలే నెరపేవు
అద్దుక నీకాఁగిలి యేయంగడి నమ్మేవయ్యా

(॥తెలి॥)
ముందుగానే పెండ్లాడి మోవి చవు లడిగేవు
యెందరిని బెల్లించితి విట్లానయ్యా
కందువ శ్రీవేంకటేశ గట్టిగా నన్నేలితివి
యిందుకే నీవయసు మిఁదెత్తుకుండితివయ్యా

(||pallavi||)
tĕlisidi nī suddulu teḍadĕllamiga nenu
malasi nannim̐ka nīvu manniṁchavayyā

(||tĕli||)
vuvviḽlūra mām̐ṭalāḍi vŏḍam̐barasevu nīvu
yĕvvadĕ neribĕ nīgu niṁtesi yayyā
navvinavvi vem̐ginaṁtā nalim̐ bŏdduluvuchchevu
avvala nīvala pĕṁdu nāhivĕṭṭidivayyā

(||tĕli||)
vŏddigĕ nem̐ jĕnagide nŏḍḍiṁchugŏnevu yī
viddĕlu yebaḽlim̐ jadividivayyā
saddigi vem̐ḍigi nābai sarasāle nĕrabevu
adduga nīgām̐gili yeyaṁgaḍi nammevayyā

(||tĕli||)
muṁdugāne pĕṁḍlāḍi movi savu laḍigevu
yĕṁdarini bĕlliṁchidi viṭlānayyā
kaṁduva śhrīveṁkaḍeśha gaṭṭigā nannelidivi
yiṁduge nīvayasu mim̐dĕttuguṁḍidivayyā