తెలిసె నీగుణమెల్లాఁ దేటతెల్లమై
(॥పల్లవి॥)
తెలిసె నీగుణమెల్లాఁ దేటతెల్లమై
కలఁడన్నవారికెల్లాఁ గలిగినట్టే పో
(॥తెలి॥)
తచ్చనైన తలఁపులో దాఁగివుంటివో కాని
ఇచ్చట నేఁ దలఁచితే నెదురైతివి
మచ్చికఁ బ్రంహ్లాదుఁడుమా లోనఁగలఁడంటే
నచ్చట నుండితివి నేఁ డటువలెనేపో
(॥తెలి॥)
చూపులోనఁ గనుపాపచొప్పున నుందువో కాని
యేపున నెందుఁ జూచిన నింతా నీవే
పైపై పదారువేలు పడఁతులకును పెక్కు-
రూపులై నిలిచినవరసవలెనే పో
(॥తెలి॥)
పంతపునాకాఁటిలోఁ బాతురాడితివోకాని
దొంతివెట్టి రతులెల్లఁ దోడుచూపితి
యింతలోనే శ్రీవేంకటేశుఁడ నీదాసులకు
సంతతము నీకృప సతమైనట్టేపో
(||pallavi||)
tĕlisĕ nīguṇamĕllām̐ deḍadĕllamai
kalam̐ḍannavārigĕllām̐ galiginaṭṭe po
(||tĕli||)
tachchanaina talam̐pulo dām̐givuṁṭivo kāni
ichchaḍa nem̐ dalam̐side nĕduraidivi
machchigam̐ braṁhlādum̐ḍumā lonam̐galam̐ḍaṁṭe
nachchaḍa nuṁḍidivi nem̐ ḍaḍuvalĕnebo
(||tĕli||)
sūbulonam̐ ganubābasŏppuna nuṁduvo kāni
yebuna nĕṁdum̐ jūsina niṁtā nīve
paibai padāruvelu paḍam̐tulagunu pĕkku-
rūbulai nilisinavarasavalĕne po
(||tĕli||)
paṁtabunāgām̐ṭilom̐ bādurāḍidivogāni
dŏṁtivĕṭṭi radulĕllam̐ doḍusūbidi
yiṁtalone śhrīveṁkaḍeśhum̐ḍa nīdāsulagu
saṁtadamu nīkṛpa sadamainaṭṭebo