Telibi seppenamte tedadellami naa guttu

తెలిపి చెప్పేనంటే తేటతెల్లమి నా గుట్టు
Language

(॥పల్లవి॥)
తెలిపి చెప్పేనంటే తేటతెల్లమి నా గుట్టు
కలసినవాఁడవు కరుణించవయ్యా

(॥॥)
మోముచూచినవాఁడవు మోహించక మానేవా
కోమలపుదాననై కొసరేఁ గాక
చేముట్టినవాఁడవు సేవగొనక మానేవా
దామెనకోరికలతోఁ దమకించేఁ గాక

(॥॥)
సేసవెట్టినవాఁ డవు చెనకక మానేవా
ఆసపడ్డదాననై యడిగేఁ గాక
బాసయిచ్చినవాఁ డవు పైకొనక మానేవా
చేసూటి వలపులఁ జిమ్మిరేఁగేఁ గాక

(॥॥)
యీడ నన్నేలినవాఁడ వింటికిరాక మానేవా
జోడైనదాననయి సొలసేఁ గాక
కూడితి విట్టె నన్ను గొబ్బున శ్రీ వేంకటేశ
జాడెఱఁగక మానేవా చాటిచెప్పేఁగాక

(||pallavi||)
tĕlibi sĕppenaṁṭe teḍadĕllami nā guṭṭu
kalasinavām̐ḍavu karuṇiṁchavayyā

(||||)
momusūsinavām̐ḍavu mohiṁchaga mānevā
komalabudānanai kŏsarem̐ gāga
semuṭṭinavām̐ḍavu sevagŏnaga mānevā
dāmĕnagorigaladom̐ damagiṁchem̐ gāga

(||||)
sesavĕṭṭinavām̐ ḍavu sĕnagaka mānevā
āsabaḍḍadānanai yaḍigem̐ gāga
bāsayichchinavām̐ ḍavu paigŏnaga mānevā
sesūḍi valabulam̐ jimmirem̐gem̐ gāga

(||||)
yīḍa nannelinavām̐ḍa viṁṭigirāga mānevā
joḍainadānanayi sŏlasem̐ gāga
kūḍidi viṭṭĕ nannu gŏbbuna śhrī veṁkaḍeśha
jāḍĕṟam̐gaga mānevā sāḍisĕppem̐gāga