Telibi seppara naa teramgu laadanigini

తెలిపి చెప్పర నా తెరఁగు లాతనికిని
Language

(॥పల్లవి॥)
తెలిపి చెప్పర నా తెరఁగు లాతనికిని
యెలమి నన్నెపుడును యెడయకుండుఁగాని

(॥తెలి॥)
గుత్తపు గుబ్బలమీఁది గురుతులు చూచుకొని
బత్తితోఁ దనరూపము భావించుకొని
హత్తి తన వుంగరము లక్కున నదుముకొని
వొత్తి విరహతాపము వోరుచుకుందాననే

(॥తెలి॥)
మచ్చికఁగా నాడిన మాటలు దలఁచుకొని
తచ్చి తనపేరు నొరఁ దడవుకొని
అచ్చమైన తనగుణా లందరిచే వినుకొని
కొచ్చి కొచ్చి తనరాక గోరుకవుందాననే

(॥తెలి॥)
పక్కనఁ దానొసఁగిన బాసలెల్లా నమ్ముకొని
ఇక్కువఁ దన రతుల కెదురుకొని
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోఁ దా నన్నేలఁగా
వొక్క మనసున వచ్చి వూరకె వుందాననే

(||pallavi||)
tĕlibi sĕppara nā tĕram̐gu lādanigini
yĕlami nannĕbuḍunu yĕḍayaguṁḍum̐gāni

(||tĕli||)
guttabu gubbalamīm̐di gurudulu sūsugŏni
battidom̐ danarūbamu bhāviṁchugŏni
hatti tana vuṁgaramu lakkuna nadumugŏni
vŏtti virahadābamu vorusuguṁdānane

(||tĕli||)
machchigam̐gā nāḍina māḍalu dalam̐sugŏni
tachchi tanaberu nŏram̐ daḍavugŏni
achchamaina tanaguṇā laṁdarise vinugŏni
kŏchchi kŏchchi tanarāga gorugavuṁdānane

(||tĕli||)
pakkanam̐ dānŏsam̐gina bāsalĕllā nammugŏni
ikkuvam̐ dana radula kĕdurugŏni
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalom̐ dā nannelam̐gā
vŏkka manasuna vachchi vūragĕ vuṁdānane