తెలి మంచు కురిసింది తలుపు తీయనా ప్రభ&
పల్లవి:
తెలి మంచు కురిసింది తలుపు తీయనా ప్రభూ....
ఇలా గొంతు వొణికింది పిలుపు నీయనా ప్రభూ....||2||
నీ దోవ పొడవునా కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి మెలకువల వందనము
చరణం 1:
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు ||2||
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు...
భాను మూర్తీ ...నీ ప్రాణకీర్తన విని
పలుకనీ ప్రణతులనీ ప్రణవ శృతినీ..
పాడనీ ప్రకృతినీ ప్రధమ కృతిని
చరణం 2:
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు ||2||
పసరు పవనాలలో పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు తాలయూర్చు
తలిరాకు బహుపరాకులు విని
దొరలనీ దోర నగవు దొంతరనీ
తరలనీ దారి తొలగి రాతిరిని
pallavi:
tĕli maṁchu kurisiṁdi talubu tīyanā prabhū....
ilā gŏṁtu vŏṇigiṁdi pilubu nīyanā prabhū....||2||
nī dova pŏḍavunā kuvaguvalā svāgadamu
nī kāli aligiḍigi mĕlaguvala vaṁdanamu
saraṇaṁ 1:
ī pūla rāgāla pulagiṁta gamagālu
gārābu kavanāla gāli saṁgadulu ||2||
nī saraṇa kiraṇālu palugariṁchina sālu
pallaviṁchunu prabhū pavaḽiṁchu bhuvanālu...
bhānu mūrdī ...nī prāṇagīrdana vini
paluganī praṇadulanī praṇava śhṛtinī..
pāḍanī prakṛtinī pradhama kṛtini
saraṇaṁ 2:
bhūbāla nī mrola ī bela gānālu
nī rājasānigavi nīrājanālu ||2||
pasaru pavanālalo pasigūna rāgālu
pasiḍi kiraṇāla paḍi padunu derina sālu tālayūrsu
talirāgu bahubarāgulu vini
dŏralanī dora nagavu dŏṁtaranī
taralanī dāri tŏlagi rādirini