Teeraale vaddamte alale aagavu kadaa

తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
Year
Language

పల్లవి:

తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా

కన్నులు రమ్మంటే కలలే రానే రావు కదా .. ఏదేమైనా నీతో నువ్వే ఉండాలికా...

చరణం 1:

ఈ వాలినా పొద్దులో చీకటే...
ఆ వేకువై ఉదయమై వెలగదా
ఏకాంతం వద్దంటూ నీ మౌనం అంటున్న..
నా పంతం నాదంటూ ఊరుకోవు కదా
కలతన్నది కన్నీరా .. తరిగే వీలుందారా
ఎడబాటే లేదంటే .. ప్రేమ కాదు కదా !

చరణం 2:

ఆనందం వద్దంటూ నే మాత్రం అంటానా
నాకొద్దు పొమ్మంటే పారిపోదు కదా
వలపన్నది తలపేనా .. తెలిసే రేపుందారా
నాకోసం రమ్మంటే .. ప్రేమ రాదు కదా !

తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా...

pallavi:

tīrāle vaddaṁṭe alale āgavu kadā
ĕvaro kādannārani ilā nuvve āgibode ĕlā

kannulu rammaṁṭe kalale rāne rāvu kadā .. edemainā nīdo nuvve uṁḍāligā...

saraṇaṁ 1:

ī vālinā pŏddulo sīgaḍe...
ā veguvai udayamai vĕlagadā
egāṁtaṁ vaddaṁṭū nī maunaṁ aṁṭunna..
nā paṁtaṁ nādaṁṭū ūrugovu kadā
kaladannadi kannīrā .. tarige vīluṁdārā
ĕḍabāḍe ledaṁṭe .. prema kādu kadā !

saraṇaṁ 2:

ānaṁdaṁ vaddaṁṭū ne mātraṁ aṁṭānā
nāgŏddu pŏmmaṁṭe pāribodu kadā
valabannadi talabenā .. tĕlise rebuṁdārā
nāgosaṁ rammaṁṭe .. prema rādu kadā !

tīrāle vaddaṁṭe alale āgavu kadā
ĕvaro kādannārani ilā nuvve āgibode ĕlā...