Teebula tana nijaalu deva rerugu

తీపుల తన నిజాలు దేవ రెరుగు
Language

(॥పల్లవి॥)
తీపుల తన నిజాలు దేవ రెరుగు
పైపై నాతోనేల పదమనవే

(॥తీపు॥)
వెన్నెలరసములు వేఁడని బదుకఁగాని
యెన్నికఁ దాఁజేయుకాఁక లివియుఁ గొన్నా
నిన్ననే వింటిని తాను నేరకాడినట్టిమాట
పన్నేటిమాయలు మాని పదమనవే

(॥తీపు॥)
అచ్చపుఁబాయమే బరవై యుండఁగాఁదా -
నిచ్చేటికానిక లందే దిదియు గొంతా
హెచ్చినయీవినయాల నిన్నిటా నేఁ దనిసితి
బచ్చెన యీగచ్చులేల పదమనవే

(॥తీపు॥)
నినుపువిరహమున నివ్వెరగై యుండఁగఁ దా-
నెనసినపరవశ మిది యొకటా
వనితి శ్రీవేంకటేశ్వరుఁడు గూడె నింకఁ
బనిగలదిక్కునకుఁ బదమనవే

(||pallavi||)
tībula tana nijālu deva rĕrugu
paibai nādonela padamanave

(||tību||)
vĕnnĕlarasamulu vem̐ḍani badugam̐gāni
yĕnnigam̐ dām̐jeyugām̐ka liviyum̐ gŏnnā
ninnane viṁṭini tānu neragāḍinaṭṭimāḍa
panneḍimāyalu māni padamanave

(||tību||)
achchabum̐bāyame baravai yuṁḍam̐gām̐dā -
nichcheḍigāniga laṁde didiyu gŏṁtā
hĕchchinayīvinayāla ninniḍā nem̐ danisidi
bachchĕna yīgachchulela padamanave

(||tību||)
ninubuvirahamuna nivvĕragai yuṁḍam̐gam̐ dā-
nĕnasinabaravaśha midi yŏgaḍā
vanidi śhrīveṁkaḍeśhvarum̐ḍu gūḍĕ niṁkam̐
banigaladikkunagum̐ badamanave