Tattarimchanedigi taruni manaseṟimgi

తత్తరించనేటికి తరుణి మనసెఱిఁగి
Language

(॥పల్లవి॥)
తత్తరించనేటికి తరుణి మనసెఱిఁగి
హత్తి మరిగించుకొని యాదరించుటగాక

(॥తత్త॥)
సిగ్గుతోడ జవరాలు శిరసువంచుకుండఁగ
దిగ్గనఁ గొప్పువట్టితియ్యవచ్చేవు
వెగ్గళించి నిన్నేమైనా వేగిరించి పలికెనా
వొగ్గి నీచేతికిలోనై వుండీఁగాక

(॥తత్త॥)
కొత్తగాఁగాఁ జెలిమాటుకొని నిలుచుండఁగాను
బత్తితోఁ గప్పురమేల పైఁజల్లేవు
వొత్తి నీవు చెనకఁగా వొవనని జంకించీనా
యిత్తల నీచేఁతలకు నియ్యకొనీఁగాక

(॥తత్త॥)
అలమేలుమంగ వొయ్యారాన నుండఁగాను
కలసి యప్పటి నెంతకాఁగిలించేవు
యెలమి శ్రీవేంకటేశ యిఁక నిన్ను మఱచీనా
మెలగి నీరతులెల్లా మెచ్చీఁగాక

(||pallavi||)
tattariṁchaneḍigi taruṇi manasĕṟim̐gi
hatti marigiṁchugŏni yādariṁchuḍagāga

(||tatta||)
siggudoḍa javarālu śhirasuvaṁchuguṁḍam̐ga
digganam̐ gŏppuvaṭṭidiyyavachchevu
vĕggaḽiṁchi ninnemainā vegiriṁchi paligĕnā
vŏggi nīsedigilonai vuṁḍīm̐gāga

(||tatta||)
kŏttagām̐gām̐ jĕlimāḍugŏni nilusuṁḍam̐gānu
battidom̐ gappuramela paim̐jallevu
vŏtti nīvu sĕnagam̐gā vŏvanani jaṁkiṁchīnā
yittala nīsem̐talagu niyyagŏnīm̐gāga

(||tatta||)
alamelumaṁga vŏyyārāna nuṁḍam̐gānu
kalasi yappaḍi nĕṁtagām̐giliṁchevu
yĕlami śhrīveṁkaḍeśha yim̐ka ninnu maṟasīnā
mĕlagi nīradulĕllā mĕchchīm̐gāga