Tarunulaala yee kada taane yerumgunane(na?)re

తరుణులాల యీ కత తానే యెరుఁగుననే(న?)రే
Language

(॥పల్లవి॥)
తరుణులాల యీ కత తానే యెరుఁగుననే(న?)రే
సరుసఁ దాఁ మనిం(న్నిం?)చితే సంతోసించేఁ గాక

(॥తరు॥)
అక్కునఁ బోసి చూపే నంటే గొల్లచల్ల గాదు
ఇక్కువైన నావలపు యేమి చెప్పేనే
పుక్కిటఁ బట్టవచ్చునా పొంగే సముద్రము
అక్కర మోవితేనియ లాసగించేఁగాక

(॥తరు॥)
పొంచి యెత్తి చూపేనంటే పూవుల చెండుగాదు
యెంచరాదు నాకోరిక యేమి చెప్పేదే
మంచు కుంచానఁ గొలవ మరి చెట్ల సమకూడు
అంచెఁ దనరాక కెదు రటు చూచేఁగాక

(॥తరు॥)
బాయిటఁ బెట్టెనంటే పంచవన్నె ముగ్గు గాదు
యీయెడ నాతమకము యేమి చెప్పేనే
చేయి చ్చలమేల్మంగ శ్రీవేంకటేశుఁడు తాను
పాయవు తన కాఁగిటఁ బాయకుండేఁ గాక

(||pallavi||)
taruṇulāla yī kada tāne yĕrum̐gunane(na?)re
sarusam̐ dām̐ maniṁ(nniṁ?)side saṁtosiṁchem̐ gāga

(||taru||)
akkunam̐ bosi sūbe naṁṭe gŏllasalla gādu
ikkuvaina nāvalabu yemi sĕppene
pukkiḍam̐ baṭṭavachchunā pŏṁge samudramu
akkara movideniya lāsagiṁchem̐gāga

(||taru||)
pŏṁchi yĕtti sūbenaṁṭe pūvula sĕṁḍugādu
yĕṁcharādu nāgoriga yemi sĕppede
maṁchu kuṁchānam̐ gŏlava mari sĕṭla samagūḍu
aṁchĕm̐ danarāga kĕdu raḍu sūsem̐gāga

(||taru||)
bāyiḍam̐ bĕṭṭĕnaṁṭe paṁchavannĕ muggu gādu
yīyĕḍa nādamagamu yemi sĕppene
seyi schalamelmaṁga śhrīveṁkaḍeśhum̐ḍu tānu
pāyavu tana kām̐giḍam̐ bāyaguṁḍem̐ gāga