తరుణికి నీకూ నొక్క తారుకాణఁ గాఁబోలు
(॥పల్లవి॥)
తరుణికి నీకూ నొక్క తారుకాణఁ గాఁబోలు
గరిమ నిద్దరి పొందూ గంటిమి నే మిపుడు
(॥తరు॥)
ఇంత తడవు నీరాక కెదురులుచూచెఁ జెలి
రంతుతో నీపైఁ బదాలు రంగుగాఁ బాడె
కొంతవడి చెలులచే కోరి నీగుణాలు వినె
చింతించఁగానే విచ్చేసితివి నీవీడకు
(॥తరు॥)
బట్టబయల నిన్నిట్టె భావించి మాఁటలాడె
గుట్టుతోడ లోలోనే గుబ్బతిలెను
నెట్టనఁ జిలుకలతో నీచుట్టరికము చెప్పె
ఇట్టె విచ్చేసితి ఇంతలో నీ వీడకు
(॥తరు॥)
తన నీడ నీవంటా తగిలి కాఁగిట నించె
వినయాన మోవిమ్మని వేఁడుకొనెను
యెనసితివి సతిని యింతలో శ్రీవేంకటేశ
మునుపై విచ్చసితివి మొనసి నీ వీడకు
(||pallavi||)
taruṇigi nīgū nŏkka tārugāṇam̐ gām̐bolu
garima niddari pŏṁdū gaṁṭimi ne mibuḍu
(||taru||)
iṁta taḍavu nīrāga kĕdurulusūsĕm̐ jĕli
raṁtudo nībaim̐ badālu raṁgugām̐ bāḍĕ
kŏṁtavaḍi sĕlulase kori nīguṇālu vinĕ
siṁtiṁcham̐gāne vichchesidivi nīvīḍagu
(||taru||)
baṭṭabayala ninniṭṭĕ bhāviṁchi mām̐ṭalāḍĕ
guṭṭudoḍa lolone gubbadilĕnu
nĕṭṭanam̐ jilugalado nīsuṭṭarigamu sĕppĕ
iṭṭĕ vichchesidi iṁtalo nī vīḍagu
(||taru||)
tana nīḍa nīvaṁṭā tagili kām̐giḍa niṁchĕ
vinayāna movimmani vem̐ḍugŏnĕnu
yĕnasidivi sadini yiṁtalo śhrīveṁkaḍeśha
munubai vichchasidivi mŏnasi nī vīḍagu