Taruni sinnagana talavamchee nide

తరుణి చిన్నగన తలవంచీ నిదె
Language

(॥పల్లవి॥)
తరుణి చిన్నగన తలవంచీ నిదె
సరసములాడుచు చనవీరాదా

(॥తరు॥)
వలచనియెలుఁగునఁ బాడీఁ జెలి నిను
వెలనుండి నీవు వినవయ్యా
చెలఁగి నిన్నుఁగని సిగ్గువడీ నిదె
నిలిచి కాఁగిటను నించఁగదయ్యా

(॥తరు॥)
వరుసఁ గరంబుల వ్రాసీ నీపేరు
సరుసఁ గూర్చుకొని చదువవయ్యా
గరిమ నందుకే మరఁగున నవ్వీ
తెల నీ విప్పుడే తియ్యఁగదయ్యా

(॥తరు॥)
సొలయుచునుఁ దోఁగి చూచీ నీ దిక్కు
జల జల సేసలు చల్లవయ్యా
కలసెను శ్రీవేంకటేశ నిన్నీకె
యెలమి నీ కెమ్మోవి యియ్యఁగదయ్యా

(||pallavi||)
taruṇi sinnagana talavaṁchī nidĕ
sarasamulāḍusu sanavīrādā

(||taru||)
valasaniyĕlum̐gunam̐ bāḍīm̐ jĕli ninu
vĕlanuṁḍi nīvu vinavayyā
sĕlam̐gi ninnum̐gani sigguvaḍī nidĕ
nilisi kām̐giḍanu niṁcham̐gadayyā

(||taru||)
varusam̐ garaṁbula vrāsī nīberu
sarusam̐ gūrsugŏni saduvavayyā
garima naṁduge maram̐guna navvī
tĕla nī vippuḍe tiyyam̐gadayyā

(||taru||)
sŏlayusunum̐ dom̐gi sūsī nī dikku
jala jala sesalu sallavayyā
kalasĕnu śhrīveṁkaḍeśha ninnīgĕ
yĕlami nī kĕmmovi yiyyam̐gadayyā