తరుణి నీతో వీడు తానేమనీనే
(॥పల్లవి॥)
తరుణి నీతో వీడు తానేమనీనే
గెరసు దాఁటక మరి కిందుపడు టరుదా
(॥తరు॥)
నేరుపే వలెఁగాని నెలఁతకు, విభుఁడు
యేరీతి నీవు చెప్పినట్టెల్లాఁ జేయఁడా
గారవించవలెఁగాని, కనుసన్నలనె వారి-
తీరుకు దిద్దుకు లోనై తిరమవు టరుగా
(॥తరు॥)
అండ నుండవలెఁగాని ఆఁడుజాతికి; విభుఁడు
వుండనుండ యెందుకైనా వొడిఁగట్టడా
మెండుకొనవలెఁ గాని, మించి వారివలలకు
తండుమోఁడై చిక్కుకొని తలవంచు టరుదా
(॥తరు॥)
చేయి చాఁచవలెఁగాని శ్రీవేంకటేశుఁడు, నాకు
పాయపురతులఁ గూడి పంతమియ్యఁడా
యీయెడ నన్ను నేలె యింతేసి కావలెగాని
దాయిదండై నాపాలిదైవమౌటరుదా
(||pallavi||)
taruṇi nīdo vīḍu tānemanīne
gĕrasu dām̐ṭaga mari kiṁdubaḍu ṭarudā
(||taru||)
nerube valĕm̐gāni nĕlam̐tagu, vibhum̐ḍu
yerīdi nīvu sĕppinaṭṭĕllām̐ jeyam̐ḍā
gāraviṁchavalĕm̐gāni, kanusannalanĕ vāri-
tīrugu diddugu lonai tiramavu ṭarugā
(||taru||)
aṁḍa nuṁḍavalĕm̐gāni ām̐ḍujādigi; vibhum̐ḍu
vuṁḍanuṁḍa yĕṁdugainā vŏḍim̐gaṭṭaḍā
mĕṁḍugŏnavalĕm̐ gāni, miṁchi vārivalalagu
taṁḍumom̐ḍai sikkugŏni talavaṁchu ṭarudā
(||taru||)
seyi sām̐savalĕm̐gāni śhrīveṁkaḍeśhum̐ḍu, nāgu
pāyaburadulam̐ gūḍi paṁtamiyyam̐ḍā
yīyĕḍa nannu nelĕ yiṁtesi kāvalĕgāni
dāyidaṁḍai nābālidaivamauḍarudā