తరుణి నీ తలఁపులు తలకూడెనే
(॥పల్లవి॥)
తరుణి నీ తలఁపులు తలకూడెనే
నిరతి లోనికి వచ్చి నిలిచె నీ విభుఁడు
(॥తరు॥)
చెక్కులవెంటఁగారే చెమట దుడుచుకొవే
యెక్కడలేని విరహమేల పెంచేవు
చిక్కువడ్డ నెఱిఁగొప్పు చక్కఁబెట్టుకోఁగదవే
పక్కన వాకిటికి నీపతి వచ్చినాఁడు
(॥తరు॥)
జారినపయ్యదకొంగు చన్నులపై మూసుకోవే
తీరుగాఁ గస్తూరిబొట్టు దిద్దుకొనవే
నేరుపులెల్లా మెరసి నీవు సింగారించుకోవే
చేరి విభుఁడదే తెరచెంతనే వున్నాఁడు
(॥తరు॥)
అలపుదీరఁగ గంద మలఁదుకొనఁగదవే
అలమేలుమంగవు మాటాడఁగదవే
కలసితి రిద్దరును కడుసంతోసించుకొవే
యెలమినిదె శ్రీవేంకటేశుఁ డున్నాఁడు
(||pallavi||)
taruṇi nī talam̐pulu talagūḍĕne
niradi lonigi vachchi nilisĕ nī vibhum̐ḍu
(||taru||)
sĕkkulavĕṁṭam̐gāre sĕmaḍa duḍusugŏve
yĕkkaḍaleni virahamela pĕṁchevu
sikkuvaḍḍa nĕṟim̐gŏppu sakkam̐bĕṭṭugom̐gadave
pakkana vāgiḍigi nībadi vachchinām̐ḍu
(||taru||)
jārinabayyadagŏṁgu sannulabai mūsugove
tīrugām̐ gastūribŏṭṭu diddugŏnave
nerubulĕllā mĕrasi nīvu siṁgāriṁchugove
seri vibhum̐ḍade tĕrasĕṁtane vunnām̐ḍu
(||taru||)
alabudīram̐ga gaṁda malam̐dugŏnam̐gadave
alamelumaṁgavu māḍāḍam̐gadave
kalasidi riddarunu kaḍusaṁtosiṁchugŏve
yĕlaminidĕ śhrīveṁkaḍeśhum̐ ḍunnām̐ḍu