(॥పల్లవి॥)
తరుణి కిచ్చకమే తగిన దిది
నిరతము నతివలు నేర్చిన ప(ఫ?)లము
(॥తరు॥)
అంగన నెవ్వరు నవుఁగాదనకురే
కంగి విరహమునఁ గాఁగినది
చెంగటఁ బతితో చెలి నొనగూర్చుటే
సంగతి మన మిచ్చటఁ గలఫలము
(॥తరు॥)
ఇంతి నెవ్వరును యిది యేమనకురే
పంతపుటాసల భ్రమసినది
యింతనంతటా యెడమాఁటల మతి-
చింత వాపుటే చెలులకు ఫలము
(॥తరు॥)
వెలఁది యిదివో శ్రీవేంకటపతితో
మలయురతుల మెయి మఱచినది
చెలువునిమర్మపుచేఁతలు చూచేటి-
చెలుములు మన మిటు సేసినఫలము
(||pallavi||)
taruṇi kichchagame tagina didi
niradamu nadivalu nersina pa(pha?)lamu
(||taru||)
aṁgana nĕvvaru navum̐gādanagure
kaṁgi virahamunam̐ gām̐ginadi
sĕṁgaḍam̐ badido sĕli nŏnagūrsuḍe
saṁgadi mana michchaḍam̐ galaphalamu
(||taru||)
iṁti nĕvvarunu yidi yemanagure
paṁtabuḍāsala bhramasinadi
yiṁtanaṁtaḍā yĕḍamām̐ṭala madi-
siṁta vābuḍe sĕlulagu phalamu
(||taru||)
vĕlam̐di yidivo śhrīveṁkaḍabadido
malayuradula mĕyi maṟasinadi
sĕluvunimarmabusem̐talu sūseḍi-
sĕlumulu mana miḍu sesinaphalamu