(॥పల్లవి॥)
తరితీపు వలపుల తక్కరీఁడ
సిరులుఁ దొలఁకఁ బైపైఁ జెనకేవు నన్నును
(॥తరి॥)
వులివచ్చిమాఁట లాడి వువిద విలువఁగానే
కలువల వేసేసేరా కమ్మటి నన్ను
అలరి ప్రియములెల్లా నాపె నీకుఁ జెప్పఁగానే
చెలిమి సేసి యిట్టే చేరేవు నన్నును
(॥తరి॥)
ముప్పిరిఁగొనఁగ నవ్వి మొక్కులాపె మొక్కఁగానే
తప్పక చూచేవేరా తగిలి నన్ను
చిప్పిలుఁ గూరిమితోడ చేతికి విడెమియ్యఁగా
అప్పటి మోవితేనె లడిగేవు నన్నును
(॥తరి॥)
కచ్చుపెట్టి రతులకు గాచు కాపె వుండఁగానే
అచ్చముగఁ గూతేవేరా అంతలో నన్ను
కొచ్చి శ్రీవేంకటగిరి గోవిందుఁడవై యిద్దిరి -
మచ్చికలకు చోనై మరిగేవు నన్నును
(||pallavi||)
taridību valabula takkarīm̐ḍa
sirulum̐ dŏlam̐kam̐ baibaim̐ jĕnagevu nannunu
(||tari||)
vulivachchimām̐ṭa lāḍi vuvida viluvam̐gāne
kaluvala veseserā kammaḍi nannu
alari priyamulĕllā nābĕ nīgum̐ jĕppam̐gāne
sĕlimi sesi yiṭṭe serevu nannunu
(||tari||)
muppirim̐gŏnam̐ga navvi mŏkkulābĕ mŏkkam̐gāne
tappaga sūseverā tagili nannu
sippilum̐ gūrimidoḍa sedigi viḍĕmiyyam̐gā
appaḍi movidenĕ laḍigevu nannunu
(||tari||)
kachchubĕṭṭi radulagu gāsu kābĕ vuṁḍam̐gāne
achchamugam̐ gūdeverā aṁtalo nannu
kŏchchi śhrīveṁkaḍagiri goviṁdum̐ḍavai yiddiri -
machchigalagu sonai marigevu nannunu