తప్పు లెంచకుము దండము వెట్టెద
(॥పల్లవి॥)
తప్పు లెంచకుము దండము వెట్టెద
చొప్పుగ నను దయఁ జూడుము నీవు
(॥॥)
చనవున నీతో సరసములాడితి
పెనఁగితిఁ గాఁగిటఁ బ్రియమునను
ననుపున నూరక నవ్వులు నవ్వితి
నెనయఁ గ నాగర్వ మేమనఁగలదు
(॥॥)
మరుగవలసి నీమనసు గరంచితి
నరుదుగ మర్మము లంటితిని
సురత వేళలను చొక్కించితీ నిను
యిరవుగ నాగుణ మిటువలె నుండె
(॥॥)
సంగడిఁ గూచుండి చన్నుల నొత్తితి
నెంగిలి పెదవులు నెదిరితిని
అంగపు శ్రీవేంకటాదిప యలమేల్-
మంగపతివి నను మన్నించు మిఁ కను
(||pallavi||)
tappu lĕṁchagumu daṁḍamu vĕṭṭĕda
sŏppuga nanu dayam̐ jūḍumu nīvu
(||||)
sanavuna nīdo sarasamulāḍidi
pĕnam̐gidim̐ gām̐giḍam̐ briyamunanu
nanubuna nūraga navvulu navvidi
nĕnayam̐ ga nāgarva memanam̐galadu
(||||)
marugavalasi nīmanasu garaṁchidi
naruduga marmamu laṁṭidini
surada veḽalanu sŏkkiṁchidī ninu
yiravuga nāguṇa miḍuvalĕ nuṁḍĕ
(||||)
saṁgaḍim̐ gūsuṁḍi sannula nŏttidi
nĕṁgili pĕdavulu nĕdiridini
aṁgabu śhrīveṁkaḍādiba yalamel-
maṁgabadivi nanu manniṁchu mim̐ kanu