తప్ప నేమిటాఁ; దనకు తన మనసు
(॥పల్లవి॥)
తప్ప నేమిటాఁ; దనకు తన మనసు
యెప్పుడు తానే దిక్కు; యిఁక దన మనసు
(॥తప్ప॥)
మానితి నాచలమెల్ల మాట చెప్పినట్టె వింటి
తా నేమిసేసినాఁ దనమనసు
కానుక చేతికిచ్చితి కడుఁ దన్ను వేఁడుకొంటి
మానిని నింతే నేను మఱి తనమనసు
(॥తప్ప॥)
నగితిఁ దనతో నేను నమ్మి యిట్టె వుందానను
తగ వెంత నడపినాఁ దనమనసు
మిగులా బందుగురాల మేనరికము చెప్పితి
మగడు తానా కైనాఁడు మరి తనమనసు
(॥తప్ప॥)
అలుగ నెన్నఁడూను అట్టె తన్నుఁ బొగడుదు
తలఁపెల్లాఁదా నెరుఁగు దనమనసు
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
మలగొనె నామనసు మరి తనమనసు
(||pallavi||)
tappa nemiḍām̐; danagu tana manasu
yĕppuḍu tāne dikku; yim̐ka dana manasu
(||tappa||)
mānidi nāsalamĕlla māḍa sĕppinaṭṭĕ viṁṭi
tā nemisesinām̐ danamanasu
kānuga sedigichchidi kaḍum̐ dannu vem̐ḍugŏṁṭi
mānini niṁte nenu maṟi tanamanasu
(||tappa||)
nagidim̐ danado nenu nammi yiṭṭĕ vuṁdānanu
taga vĕṁta naḍabinām̐ danamanasu
migulā baṁdugurāla menarigamu sĕppidi
magaḍu tānā kainām̐ḍu mari tanamanasu
(||tappa||)
aluga nĕnnam̐ḍūnu aṭṭĕ tannum̐ bŏgaḍudu
talam̐pĕllām̐dā nĕrum̐gu danamanasu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ
malagŏnĕ nāmanasu mari tanamanasu