తనువు తనదిగాని తలఁపు నీది
(॥పల్లవి॥)
తనువు తనదిగాని తలఁపు నీది
పెనఁగి మాఁకునఁ దీగె బెరసినయట్లు
(॥తను॥)
మోమునఁ గన్నులుగాని మోహపుఁజూపులు నీపై
కామినిభావము చెప్పఁ గతలాయను
తామరలు కొలనిలోఁ దరులఁ బరిమళము
వేమారు నిండుకొన్నవిధమాయ నిపుడు
(॥తను॥)
చెలితో మాటలుగాని చిమ్ముచేఁతలు నీపైఁ
గలిగినవిధమెట్లాఁ గనుఁగొనుమీ
చిలుకలు వనములఁ జెలరేఁగుపలుకులు
వలరాజునమ్ములకు వాఁడివెట్టినట్లు
(॥తను॥)
వురముపై నుంటేకాని వువిదప్రాణము నీపై
గరిమల శ్రీవేంకటవిభుఁడ
సరిలేనిమీలోనిసరసపుఁగూటములు
ఇరవాయఁ బాలు నీరు నేకమైననగతిని
(||pallavi||)
tanuvu tanadigāni talam̐pu nīdi
pĕnam̐gi mām̐kunam̐ dīgĕ bĕrasinayaṭlu
(||tanu||)
momunam̐ gannulugāni mohabum̐jūbulu nībai
kāminibhāvamu sĕppam̐ gadalāyanu
tāmaralu kŏlanilom̐ darulam̐ barimaḽamu
vemāru niṁḍugŏnnavidhamāya nibuḍu
(||tanu||)
sĕlido māḍalugāni simmusem̐talu nībaim̐
galiginavidhamĕṭlām̐ ganum̐gŏnumī
silugalu vanamulam̐ jĕlarem̐gubalugulu
valarājunammulagu vām̐ḍivĕṭṭinaṭlu
(||tanu||)
vuramubai nuṁṭegāni vuvidaprāṇamu nībai
garimala śhrīveṁkaḍavibhum̐ḍa
sarilenimīlonisarasabum̐gūḍamulu
iravāyam̐ bālu nīru negamainanagadini