Tanuvu badalenu talabu bhramasenu

తనువు బడలెను తలపు భ్రమసెను
Language

(॥పల్లవి॥)
తనువు బడలెను తలపు భ్రమసెను
యెనసిన తా నెఱుఁగు నిఁక నేఁటిదే

(॥తను॥)
మంతనాన నుండితేను మనోరథాలవెద
కాంతునిఁజిత్తానఁ గంటేఁ గన్నీటివెద
కాంతలలోఁ జెప్పఁబోతే కందువసిగ్గులవెద
యెంతటానుఁ బొద్దువోదు యేమి సేసేదే

(॥తను॥)
చెలులలోన నుంటే చెప్పడుబుద్దులవెద
వెలినుంటేఁ జందురుని వెన్నెలవెద
తొలఁగి నిద్దురవోతేఁ గలలోన నీవెద
యెలమి నింతటిమీఁద నేమిసేసేదే

(॥తను॥)
యిచ్చట శ్రీవేంకటేశుఁడింతలో విచ్చేసి కూడె
కొచ్చీ నూర్పులబుసకొట్లవెద
మెచ్చురతిబంధముల మించుఁజెమటలవెద
హెచ్చీ: వెదలెల్లఁ దీరె నేమి సేసేదే

(||pallavi||)
tanuvu baḍalĕnu talabu bhramasĕnu
yĕnasina tā nĕṟum̐gu nim̐ka nem̐ṭide

(||tanu||)
maṁtanāna nuṁḍidenu manorathālavĕda
kāṁtunim̐jittānam̐ gaṁṭem̐ gannīḍivĕda
kāṁtalalom̐ jĕppam̐bode kaṁduvasiggulavĕda
yĕṁtaḍānum̐ bŏdduvodu yemi sesede

(||tanu||)
sĕlulalona nuṁṭe sĕppaḍubuddulavĕda
vĕlinuṁṭem̐ jaṁduruni vĕnnĕlavĕda
tŏlam̐gi nidduravodem̐ galalona nīvĕda
yĕlami niṁtaḍimīm̐da nemisesede

(||tanu||)
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ḍiṁtalo vichchesi kūḍĕ
kŏchchī nūrbulabusagŏṭlavĕda
mĕchchuradibaṁdhamula miṁchum̐jĕmaḍalavĕda
hĕchchī: vĕdalĕllam̐ dīrĕ nemi sesede