తనుఁ దడవితేనే తడవఁగ వలెఁ గాక
(॥పల్లవి॥)
తనుఁ దడవితేనే తడవఁగ వలెఁ గాక
చనవిచ్చి మిగులాను సాదించీ తాను
(॥తనుఁ॥)
అందరు సతులు మాటలాడుకోఁగా నీతఁడు
మందలించి సందుసుడిమా టాడీఁదాను
పొందుగాఁ గొమ్మలు వంచి పువ్వులు గోయఁగాను
మందెమేళమునను వేమరు నవ్వీఁదాను
(॥తనుఁ॥)
చెలు లొక్కరొకరే సింగారించు కొనఁగాను
అలరుచువచ్చి చీర లందిచ్చీఁదాను
పొలయుచు నేఁడు వనభోజనాలు సేయఁగాను
అలమి పొత్తుల నుండి ఆరగించీఁదాను
(॥తనుఁ॥)
మేరమీరి చెలులెల్లా మేడమీఁద నుండఁగాను
కోరి వరుసవెట్టుక కూడీఁదాను
యీరీతి శ్రీవేంకటేశుఁ డీమెయింటికి రాఁగా
పేరుకొని సేసలెల్లాఁ బెట్టేఁదాను
(||pallavi||)
tanum̐ daḍavidene taḍavam̐ga valĕm̐ gāga
sanavichchi migulānu sādiṁchī tānu
(||tanum̐||)
aṁdaru sadulu māḍalāḍugom̐gā nīdam̐ḍu
maṁdaliṁchi saṁdusuḍimā ṭāḍīm̐dānu
pŏṁdugām̐ gŏmmalu vaṁchi puvvulu goyam̐gānu
maṁdĕmeḽamunanu vemaru navvīm̐dānu
(||tanum̐||)
sĕlu lŏkkarŏgare siṁgāriṁchu kŏnam̐gānu
alarusuvachchi sīra laṁdichchīm̐dānu
pŏlayusu nem̐ḍu vanabhojanālu seyam̐gānu
alami pŏttula nuṁḍi āragiṁchīm̐dānu
(||tanum̐||)
meramīri sĕlulĕllā meḍamīm̐da nuṁḍam̐gānu
kori varusavĕṭṭuga kūḍīm̐dānu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍīmĕyiṁṭigi rām̐gā
perugŏni sesalĕllām̐ bĕṭṭem̐dānu